»   » ఇండస్ట్రీ షాక్ : నటిపై పేరున్న నిర్మాత దాడి, పోలీస్ కేసు, ఇరికించే కుట్ర అంటూ నిర్మాత

ఇండస్ట్రీ షాక్ : నటిపై పేరున్న నిర్మాత దాడి, పోలీస్ కేసు, ఇరికించే కుట్ర అంటూ నిర్మాత

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొచ్చి: మళయాళి నటి, నిర్మాత సాండ్రా ధామస్ తనపై నిర్మాత విజయ్ బాబు దాడి చేసారని,పోలీస్ కేసు పెట్టారు. విజయ్ బాబు, సాండ్రా ధామస్ ఇద్దరి మధ్యా చాలా క్లోజ్ ఫ్రెండ్ షిప్ ఉండేది. వీళ్లిద్దరూ కలిసి ఫ్రై డే ఫిల్మ్ హౌస్ బ్యానర్ పై దాదాపు పది సినిమాలు దాకా నిర్మించారు. సాండ్రా ధామస్ కేవలం సహ నిర్మాతగానే కాకుండా మరో ప్రక్కన నటిగానూ మంచి పేరు తెచ్చుకుంది. అయితే వీళ్ళిద్దరూ ఇలా తగువుపడి కేసులు పెట్టుకోవటం మళయాళ ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది.

రీసెంట్ గా సాండ్రా ధామస్ ...విజయ్ బాబుపై ఎలమక్కరా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసారు. తనను బెదిరించి, దాడి చేసారని ఆ కంప్లైంట్ లో రాసారు. అంతేకాకుండా ఆమె కొచిలోని ఓ ప్రెవేట్ హాస్పటిల్ లో జాయిన్ అయ్యారు.

సాండ్రా ధామస్ చెప్పేదాని ప్రకారం... ఆమె విజయ్ బాబుతో పార్టనర్ షిప్ ని రద్దు చేసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు విజయ్ బాబుని కలిసి తన షేర్ తనకు పంచి ఇచ్చేయమని, మ్యాటర్స్ సెటిల్ చెయ్యమని కోరింది. అందునిమిత్తం..ఆమె తన భర్త విల్సన్ తో కలిసి ఫ్రైడే ఫిల్మ్ హౌస్ ఆఫీస్ కి వెళ్లారు. తమ పార్టిషన్ విషయమై డిస్కస్ చేయబోయారు.

SHOCKING! Sandra Thomas Files Police Complaint Against Business Partner Vijay Babu

అయితే తన వాటా ఇవ్వమని అడగగానే విజయ్ బాబుకు కోపం వచ్చింది. ఆమెపై తన అశోశియేట్స్ కొంతమందితో కలిసి ఎటాక్ చేసారు. ఆమె చెప్పే వెర్షన్ ఏమిటంటే...విజయ్ బాబుకి ఆమెతో ఇలా హఠాత్తుగా పార్టనర్ షిప్ రద్దు చేసుకోవటం ఇష్టం లేదు.

ఇదిలా ఉంటే...విజయ్ బాబు..ఇది ద్రోహపూరితమైన నిర్ణయం అని, సాండ్రా ఆరోపణలు అన్ని తన ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా కొట్టి పారేసే ప్రయత్నం చేసారు. తన నుంచి బిజినెస్ ని, ప్రాపర్టీని మొత్తం లాక్కోవటానికి తను ఎంతగానో నమ్మిన బిజినెస్ పార్టనర్, ఆమె భర్త కలసి ప్లాన్ చేసి, ఇలా ఇరికిస్తున్నారు అన్నారు.

ఇక ఈ వివాదం, కేసులు, దాడి వంటివి ఈ నిర్మాత ద్వయం నుంచి ఊహించలేదంటోంది మళయాళ చిత్ర పరిశ్రమ. ఈ సంఘటన చాలా మందిని షాక్ కి గురి చేసింది. ఎందుకంటే విజయ్,సాండ్రా కలిసి దాదాపు పది సినిమాలు దాకా నిర్మించారు. అందులో మోహన్ లాల్ హీరోగా చేసినవే రెండు ఉండటం విశేషం.

English summary
Sandra Thomas filed a police complaint against Vijay Babu at Elamakkara police station, alleging that he assaulted and threatened her. The actress-producer has been admitted to a private hospital in Kochi, following the incident.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu