»   » కేరళనటి కిడ్నాప్ కేసులో షాకింగ్ వాస్తవాలు : రహస్యంగా నగ్నచిత్రాలు తీసి, డబ్బులువసూలు

కేరళనటి కిడ్నాప్ కేసులో షాకింగ్ వాస్తవాలు : రహస్యంగా నగ్నచిత్రాలు తీసి, డబ్బులువసూలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మళయాళ నటిపై దుండగులు దాడికి పాల్పడ్డారన్న వార్త సినీప్రపంచాన్నే కాకుండా సాధారణ మహిళలను సైతం దిగ్బ్రాంతి కిగురిచేసింది. ఆమెకు సంఘీభావం తెలుపుతూ పలువురు నటీనటులు సోషల్‌ మాధ్యమాల్లో సందేశాలు పోస్టు చేస్తున్నారు. ఒక టాప్ హీరోయిన్ గా ఉన్న భావనపై ఈ స్థాయి ఘటన చోటుచేసుకోవడం మలయాళ ఇండస్ట్రీ వర్గాలలో కలకలం రేపింది. 'ఒంటరి' చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఆమె అచ్చ తెలుగు అమ్మాయిలా ప్రేక్షకులను అలరించింది.

ఆ తర్వాత నితిన్ తో 'హీరో,' కృష్ణవంశీ , శ్రీకాంత్ ల కలయికలో వచ్చిన 'మహాత్మా,' రవితేజ 'నిప్పు' సినిమాలలో నటించింది. తెలుగులో అంతంత మాత్రపు అవకాశాలే వచ్చినప్పటికీ, మలయాళంలో ఈ ముద్దుగుమ్మ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అలాంటి నటి మీద, అదీ రద్దీగా ఉండే సిటీలో ఇలా జరటం దక్షిణాది సినీ పరిశ్రమ మొత్తానికి షాక్ గా మారింది...

హీరోయిన్ కాజల్:

హీరోయిన్ కాజల్:

ఈ ఘటనతో ప్రముఖ నటులు, నటీమణల కుటుంబ సభ్యులు తమ వారి సేఫ్టీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పర్సనల్ స్టాఫ్ ను నియమించుకునే విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే ఆలోచనలో పడ్డారు. మళయాల నటి విషయంలో జరిగిన ఘటనతో హీరోయిన్ కాజల్ తల్లి వినయ్ అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేసారు. ఇకపై తన కూతురు సేఫ్టీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు తెలిపారు.

ఇండస్ట్రీతో సంబంధాలున్నవారే:

ఇండస్ట్రీతో సంబంధాలున్నవారే:

అయితే ఆమె పై ఈ దాడి కి పాల్పడ్డ ఆరుగురిలో ఇద్దరు డ్రైవర్లు మినహా మిగతావారంతా సినీ ఇండస్ట్రీతో సంబంధాలున్నవారేనని, వీరు పలు ప్రొడక్షన్ ఉద్యోగాలు చేస్తున్నారని కేసును విచారిస్తున్న పోలీసులు తెలిపారు. ఈ కిడ్నాప్ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు అడిషనల్ డీజీపీ బీ సంధ్య నేతృత్వంలో దినేంద్ర కస్యప్ ను విచారణ అధికారిగా నియమించగా, కేసులో మరో ఇద్దరిని కోయంబత్తూరులో అరెస్ట్ చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

ఊహించని కోణం:

ఊహించని కోణం:

అయితే పట్టుబడిన వారి ని విచారిస్తున్న క్రమం లో మరిన్ని దారుణాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకూ ఏదో కక్ష సాధింపు చర్య గా అనుకుంటున్న ఈ కేసు లో ఊహించని కోణం వెలుగుచూసింది. గతం లోనే హీరోయిన్‌ దుస్తులు మార్చుకుంటున్న సమయంలో రహస్యంగా ఫోటోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్లు నిందితులు వెల్లడించారు. నెల క్రితం ఆ ఫోటోలను చూపించి, ఆమెను బెదిరించి డబ్బు వసూలు చేసినట్లు విచారణలో తేలింది.

ఒక హీరో హస్తం ఉందని :

ఒక హీరో హస్తం ఉందని :

ముందు మాజీ డ్రైవర్ ఏదో ఆవేశంలో తన వాళ్లతో కలిసి కారు ఎక్కి ఏడిపించాడని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కిడ్నాప్ అని అర్థమైంది. ఇప్పుడు ఈ కిడ్నాప్ వెనుక ఒక హీరో హస్తం ఉందని పోలీసుల విచారణలో వెల్లడవడం గమనార్హం.

రూ.30 లక్షలు ఇచ్చి:

రూ.30 లక్షలు ఇచ్చి:

కిడ్నాప్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన సునీల్ కుమార్ అనే వ్యక్తికి ఆ హీరో రూ.30 లక్షలు ఇచ్చి ఈ కిడ్నాప్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక పొలిటీషియన్ కిడ్నాప్ కు ప్లాన్ చేసిన హీరోకు ఒకప్పుడు ఆమె మంచి ఫ్రెండేనట. ఆమె అతడి పెళ్లికి కూడా వెళ్లిందట.

కక్ష పెంచుకున్న హీరో :

కక్ష పెంచుకున్న హీరో :

ఐతే అతను తన భార్య నుంచి విడిపోవడానికి ఈమె కారణమైందట. ఆ హీరోకు.. అతడి భార్యకు విభేదాలు తలెత్తినపుడు ఈమె అతడి వైపు నిలవకుండా భార్య వైపు మాట్లాడిందట. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ కు.. ఆ హీరోకు విభేదాలు తలెత్తినట్లు సమాచారం. కక్ష పెంచుకున్న ఆ హీరో ఏకంగా ఆమెను కిడ్నాప్ చేసి ఏదో చేయాలని ప్లాన్ చేసే వరకు వెళ్లింది.

హీరోను అదుపులోకి:

హీరోను అదుపులోకి:

పోలీసులు ప్రస్తుతం ఆ హీరోను అదుపులోకి తీసుకునే పనిలో ఉన్నారు. కిడ్నాప్ లో పాల్గొన్న వారందరినీ మరిన్ని వివరాల కోసం విచారిస్తున్నారు. ఇంకో రెండు మూడు రోజుల్లో ఈ కేసు వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని.. మీడియాకు వివరాలు అందజేస్తారని మలయాళ మీడియా అంటోంది.కొడుకులిద్దరి ప్రమేయం కూడా ఉన్నట్లు సమాచారం.

మరో హీరో హస్తం కూడా :

మరో హీరో హస్తం కూడా :

ఈ మొత్తం తతంగం వెనుక మరో హీరో హస్తం ఉన్నట్టుగా కూడా గుసగుసలు అయితే ఈ బ్లాక్‌మెయిలింగ్ వ్యవహారంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన మరొకరి పాత్ర కూడా ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి డ్రైవర్ మార్టిన్ ఆంటోనిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు జరిగిన అన్యాయంపై పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

English summary
It's reported that cops are suspecting the hand of a hero, two sons of a noted politician behind the Malayalam Actress Kidnap. Apparently, She had serious differences with the hero for sometime.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu