»   »  శ్రీదేవి జీవితంలోని షాకింగ్ విషయాలు (ఫోటో ఫీచర్)

శ్రీదేవి జీవితంలోని షాకింగ్ విషయాలు (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించి అందరి మనసులను దోచుకున్న అతిలోక సుందరి శ్రీదేవి. ఆమె తన 52 వ పుట్టిన రోజుని ఈ రోజు(ఆగస్టు 13) జరుపుకుంటోంది. ఆమె గురించి ప్రత్యేకంగా రాయటానికి ఏమీ ఉండదు. ఎందుకంటే ఆమె రెండు మూడు జనరేషన్స్ కు అతిలోక సుందరి.

గ్లామర్ కే గ్లామర్ పాఠాలు నేర్పగల ఆమె 1975లో జూలీ సినిమాతో బాల నటిగా మనకు పరిచయం అయిన శ్రీదేవి ఎన్.టి.ఆర్, ఏఎన్ఆర్ లతో ఎన్నో సినిమాల్లో నటించింది. అంతే కాకుండా చిరంజీవి, నాగార్జునతో కూడా పలు సినిమాల్లో నటించి అందరి ప్రశంసలు పొందింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ఎన్నో సినిమాల్లో నటించిన బోని కపూర్ ను వివాహం చేసుకొన్న తరువాత సినిమాలకు దూరం అయ్యింది. మూడేళ్ల క్రితం 'ఇంగ్లీష్ వింగ్లీష్' సినిమాతో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత తాజాగా తమిళ చిత్రం 'పులి' చిత్రంలో నటిస్తోంది.

శ్రీదేవి సినీ, పర్సనల్ లైప్ లో మీకు తెలియని ఆసక్తికర విషయాలు స్లైడ్ షోలో...

హాలీవుడ్ ఆఫర్

హాలీవుడ్ ఆఫర్


హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ దర్శకత్వంలో నటించటమంటే అందరూ ఎగబడతారు. అలాంటిది ఆమెకు జురాసిక్ పార్క్ చిత్రంలో కీ రోల్ లో ఆఫర్ వచ్చింది. అయితే బాలీవుడ్ కు దూరం అవుతాను అని భావించిన ఆమె దాన్ని కాదంది. ఆ తర్వాత ఆ చిత్రం ప్రంపంచ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. తప్పకుండా తర్వాత శ్రీదేవి ఏదో ఒక రోజు ఈ సినిమా మిస్ అయ్యానే అనుకునే ఉంటుంది.

తొలి ప్రేమ..బ్రేకప్

తొలి ప్రేమ..బ్రేకప్


శ్రీదేవి మొదట్లో మిధున్ చక్రవర్తితో డేటింగ్ చేసింది. అలాగే వాళ్లిద్దరూ సీక్రెట్ గా మ్యారేజ్ కూడా చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. అయితే మిధున్ కి అప్పటికే పెళ్లైందనే విషయం ఆమెకు తెలియదు. దాంతో వారి ప్రేమ కథ అక్కడితో ఆగిపోయింది.

మెగా స్టార్ నే వద్దనుకుంది

మెగా స్టార్ నే వద్దనుకుంది


శ్రీదేవి చాలా కాలం బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ ప్రక్కన చేయటానికి ఇష్టం చూపలేదు. ఎన్నో ఆఫర్స్ వదులుకుంది. దాని కారణం ఆమె 1987లో ఫిల్మ్ ఫేర్ ఇంటర్వూలో చెప్పింది. అమితాబ్ వంటి స్టార్ సినిమాలో తనలాంటి హీరోయిన్ చేయటానికి ఏముంటుంది అని వ్యాఖ్యానించింది. అఫ్ కోర్స్ తర్వాత ఆమె తన పాత్ర ఫ్రాధాన్యమున్న అమితాబ్ చిత్రాల్లో నటించిందనుకోండి.

మొదట్లో ఆమెనే...

మొదట్లో ఆమెనే...


తెలుగులో విజయవంతమైన అబ్బాయిగారు కి హిందీ వెర్షన్ అయిన బేటా చిత్రంకు మెదట ఆమెనే అడిగారు. అయితే అనీల్ కపూర్ తో ఆమె అనేక సినిమాలు చేసానని ఇంట్రస్ట్ చూపలేదు. దాంతో ఆ పాత్ర మాధురీ దీక్షిత్ కి వెళ్లింది. తర్వాత ఆ సినిమాలోని ధక్ ధక్ పాట ఎంత పెద్ద హిట్టో తెలిసిందే.

విభేదాలు

విభేదాలు


శ్రీదేవిని చాలా మంది గంభీరంగా, రిజర్వ్ గా ఉంటుందని అనుకుంటారు. కుటుంబ సభ్యుల ప్రాపర్టీ విషయంలో ఆమెకు చెల్లెలు శ్రీలత తో విభేధాలు వచ్చాయి. రెండు దశాబ్దాలు పైగా సాగిన ఈ విభేధాలు శ్రీదేవిలో ఉన్న క్షమాగుణంతో ఓ ముద్దుతో పరిష్కారం అయ్యింది.

పెళ్లికి ముందే గర్బం

పెళ్లికి ముందే గర్బం


హీరోయిన్ శ్రీదేవి నిర్మాత బోనీ కపూర్‌ను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందే బోనీ కపూర్ కారణంగా శ్రీదేవి గర్భవతి అయింది. పెళ్లయ్యే నాటికి శ్రీదేవి 7 నెలల గర్బవతి.

జయప్రదతో పడదు

జయప్రదతో పడదు


ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలిన తెలుగు తారల్లో శ్రీదేవి, జయప్రదలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. అప్పట్లో ఈ ఇద్దరికి అస్సలు పడేది కాదు. ఇద్దరూ తెలుగువారే అయినా ఒకరికొకరు ఎదురు పడినా అసలు మాట్లాడుకునే వారు కాదు. ‘దేవత' షూటింగ్ సమయంలో నటుడు జితేంద్ర వీరిద్దరి కలిపేందుకు ప్రయత్నించారు. ఇద్దరూ ఒకే గదిలో ఉండగా గడి పెట్టేసారు. రెండు గంటల పాటు అలానే ఉంచేసారు. అయితే ఆయన ప్రయత్నం ఫలించలేదు. ఈ విషయాన్ని జయప్రధ రీసెంట్ గుర్తు చేసుకుంది కూడా.

English summary
Check out Shocking things in Sridevi's life.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu