»   » హాట్ గా తయారైంది: మరో స్టార్ హీరో కూతురు ఎంట్రీ (ఫోటోస్)

హాట్ గా తయారైంది: మరో స్టార్ హీరో కూతురు ఎంట్రీ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోందంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే చదువు పూర్తయిన తర్వాతే బాలీవుడ్ ఎంట్రీ అని ఇంట్లో తేల్చి చెప్పడంతో స్టడీస్ మీదనే ఫోకస్ పెట్టిన సారా కొంతకాలంగా అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీలోనే ఉంటూ విద్యనభ్యసిస్తోంది. తాజాగా సారా గ్రాజ్యువేషన్ పూర్తయింది. చదువు ఇంతటితో ఆపేసి ఇండియా వచ్చి సినిమాల మీద ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకుంది.

చిన్నతనంలో సారా కాస్త లావుగానే ఉండేది. అయితే హీరోయిన్ అవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత అందుకు తగిన విధంగా తయారవ్వాలి కాబట్టి కొంత కాలంగా ఫిజిక్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. బాలీవుడ్లో హీరోయిన్ అవ్వాలంటే అందం పరంగా ఏయే క్వాలిటీస్ ఉండాలో అన్ని ఉండేలా...హాట్ లుక్ తో ఆకట్టుకునే తయారైంది.

మరో వైపు సారాను హీరోయిన్ పరిచయం చేసేందుకు బాలీవుడ్ టాప్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు పోటీ పడుతున్నారు. ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఆమెను తన సినిమా ద్వారా పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఆమె సినిమా తెరంగ్రేటం విషయమై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

సారా సినిమాల్లోకి రావడంపై సైఫ్...
సారా సినిమాల్లోకి రావాలనే కోరికతో ఉన్న మాట నిజమే అని సైఫ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ముందు చదువు పూర్తి చేయమని చెప్పాను. ఆ తర్వాత ఆమె బాలీవుడ్లో కెరీర్ ఎంచుకున్నా, మరే రంగంలో కెరీర్ ఎంచుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సైఫ్ తెలిపారు. తన సోదరి సోహా అలీ ఖాన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డిగ్రీ పొందిందని, ఆ తర్వాతే సినిమాల్లోకి వచ్చిందని సైఫ్ అలీ ఖాన్ తెలిపారు.

గతంతో పోలిస్తే సారా అలీ ఖాన్ ఇపుడు చాలా హాట్ గా తయారైంది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇక్కడ చూడొచ్చు.

సారా అలీ ఖాన్

సారా అలీ ఖాన్

సైఫ్, ఆయన మొదటి భార్య అమృత సింగ్ ల కూతురే సారా అలీ ఖాన్.

చిన్న తనం నుండి సినిమా వాతావరణంలోనే..

చిన్న తనం నుండి సినిమా వాతావరణంలోనే..

సారా తల్లి అమృత సింగ్ కూడా ఒకప్పుడు బాలీవుడ్లో హీరోయిన్ గా నటించింది. సైఫ్ ఫ్యామిలీ అంతా కూడా సినిమాల్లో ఉండటంతో ఆ ప్రభావం సారాపై కూడా పడింది.

ప్రోత్సాహం

ప్రోత్సాహం

బాలీవుడ్లో కెరీర్ ఎంచుకోవాలనుకున్న సారాకు ముందు నుండి ఇంట్లో వారి నుండి కూడా ప్రోత్సాహం లభిస్తోంది.

స్టడీస్

స్టడీస్

అయితే ఇంట్లో వారి కోరిక మేరకు ముందుగా స్టడీస్ మీద ఫోకస్ పెట్టింది సారా.

గ్రాజ్యుయేషన్ పూర్తి

గ్రాజ్యుయేషన్ పూర్తి

అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీలో సారా అలీ ఖాన్ గ్రాజ్యుయేషన్ ఇటీవలే పూర్తయింది.

నెక్ట్స్ సినిమాలే...

నెక్ట్స్ సినిమాలే...

పట్టబద్రురాలైంది కాబట్టి ఇకపై తన ఫోకస్ అంతా బాలీవుడ్ మీదనే పెట్టబోతోంది సారా.

బాలీవుడ్

బాలీవుడ్

సారాను హీరోయిన్ పరిచయం చేసేందుకు బాలీవుడ్ టాప్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు పోటీ పడుతున్నారు.

కరణ్ జోహార్

కరణ్ జోహార్

ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఆమెను తన సినిమా ద్వారా పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సైఫ్

సైఫ్

సారా సినిమాల్లోకి రావాలనే కోరికతో ఉన్న మాట నిజమే అని సైఫ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

స్టడీస్ ఫస్ట్

స్టడీస్ ఫస్ట్

చదువు పూర్తి చేయమని చెప్పాను. ఆ తర్వాత ఆమె బాలీవుడ్లో కెరీర్ ఎంచుకున్నా, మరే రంగంలో కెరీర్ ఎంచుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సైఫ్ తెలిపారు.

సారా

సారా

గతంతో పోలిస్తే సారా అలీ ఖాన్ ఇపుడు చాలా హాట్ గా తయారైంది

English summary
From the past few months, Saif Ali Khan's daughter, Sara Ali Khan is continuously in the limelight owing to the obvious reason i.e., her shocking transformation from flab to fab! To our surprsie, the young lass has not only shed some kilos but has also worked on dressing style.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu