For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆత్మ హత్య కాదు., ఆమె హత్యకు గురయ్యింది... జియా ఖాన్ కేసు లో కొత్త ట్విస్ట్...

  |

  2013లో బాలీవుడ్‌ నటి జియాఖాన్‌ ఆత్మహత్య సష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. బోయ్‌ ఫ్రెండ్‌ సూరజ్‌ పంచోలి నిరాదరణ తట్టుకోలేక ముంబై జూహులోని తన నివాసంలో ఉరివేసుకుని ప్రాణం తీసుకుంది జియా. అయితే జియా సూయిసైడ్‌పై అనేక అనుమానాలున్నాయి. జియాది ముమ్మాటికీ హత్యే అని తన కుమార్తెది ఆత్మహత్య కాదు, హత్య అని బలంగా వాదిస్తున్న జియాఖాన్ తల్లి రబియా అమీన్ సరికొత్త సాక్ష్యాలతో బాంబే హైకోర్టు గడప తొక్కనున్నారు.

  లేత వయసులోనే లివింగ్ లెజెండ్ అమితాబ్ తో నటించి యావత్ భారతదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియాఖాన్ 2013 లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే .అయితే అప్పట్లోనే అది హత్యా ఆత్మ హత్యా అన్న విషయం లో చాలానే వాదోపవాదాలు జరిగాయి. జియా ప్రేమికుడు సూరజ్ఞ్ పంచోలీ మీదే అనేక అనుమానాలు వచ్చినప్పటికీ. అప్పటి ఆధారాల ప్రకారం అతడిని దోషి గా నిరూపించలేకపోవటం తో అతను ఇప్పుడు బెయిల్ మీద బయటే ఉన్నాడు. అయితే తన కూతురి అనుమానాస్పద మరణం పై న్యాయ పోరాటం చేస్తూనే ఉన్న జియా తల్లి ఇప్పుడు తాజా ఋజువులతో మళ్ళీ ఆ కేసుని తిరగ దోడే ప్రయత్నం చేస్తున్నారు.

  ఉరివేసుకుని ప్రాణం తీసుకుంది :

  ఉరివేసుకుని ప్రాణం తీసుకుంది :

  2013లో బాలీవుడ్‌ నటి జియాఖాన్‌ ఆత్మహత్య సష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. బోయ్‌ ఫ్రెండ్‌ సూరజ్‌ పంచోలి నిరాదరణ తట్టుకోలేక ముంబై జూహులోని తన నివాసంలో ఉరివేసుకుని ప్రాణం తీసుకుంది జియా.. నట దంపతులు ఆదిత్య పంచోలీ, జరీనా వహాబ్‌ల కుమారుడు సూరజ్ పంచౌలీతో చెడిన ప్రేమ వ్యవహారంపై ఆత్మహత్యకు ముందు జియాఖాన్ రాసిన ఆరు పేజీల నోట్‌ను ఆమె కుటుంబ సభ్యులు ఇంట్లో కనుగొన్నారు.

  లేఖ దొరికింది:

  లేఖ దొరికింది:

  ఆ నోట్ నకలును కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అందించేందుకు అంగీకరించారు. ‘‘నువ్వు నన్ను మోసం చేశావు. నేను మన బంధాన్ని నమ్మగా నువ్వు బేఖాతరు చేశావు. నువ్వు ఈ లేఖ చదవే నాటికి నేను ఈ లోకంలో ఉండను''అంటూ జియా రాసుకున్న లేఖ దొరికింది. అయితే అది చనిపోవటానికి ముందు రాయలేదనీ అంతకు ముందెప్పుడో రాసిందనీ కొన్ని వార్తలు వచ్చాయి.

  చున్నీతో ఉరి వేసుకోవడం వల్ల :

  చున్నీతో ఉరి వేసుకోవడం వల్ల :

  జియాఖాన్ ఆత్మహత్య అనంతరం న్యాయస్థానానికి సమర్పించిన ఫోరెన్సిక్ రిపోర్టులో ఆమె కింది పెదవిపై బలమైన గాయం ఉంది. ఉరి వేసుకున్నాక ఊపిరి ఆడని స్థితిలో ఆమే తన పెదవిని కొరుక్కొని ఉంటుందని వైద్యులు నివేదికలో పేర్కొన్నారు.అలాగే జియా ఖాన్ మెడపై, కింది దవడల వద్ద కూడా మచ్చలు కనిపించాయి. ఇవి చున్నీతో ఉరి వేసుకోవడం వల్ల ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దీంతో జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని డిఫెన్స్ వాదించింది.

  ఆత్మహత్య చేసుకోవటం వల్లే:

  ఆత్మహత్య చేసుకోవటం వల్లే:

  జియాఖాన్ ఆత్మహత్య చేసుకోవటం వల్లే మృతి చెందినట్లు నిర్థారణ అయ్యింది. ఆమె మృతదేహానికి శవ పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఈ విషయాన్ని వెల్లడించారు. రాత్రి 11 నుంచి 11.30 గంటల సమయంలో జియాఖాన్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్టమార్టం నివేదికలో వైద్యులు తెలిపారు. తీవ్రమైన మానసిక ఒత్తిడితోపాటు, ప్రియుడితో వాగ్వివాదం కారణంగా ఆమె తన నివాసంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నట్టు నిర్ధారించారు.

  షాకింగ్‌ విషయాలు:

  షాకింగ్‌ విషయాలు:

  ఈ వాదన తోనే ఈ కేసులో ప్రదాన నిందితుడు ఆత్మహత్య చేసుకోవటం వల్లేకి బెయిల్ లభించింది. దీంతో విభేదించిన జియాఖాన్ తల్లి రబియా అమీన్ అంతర్జాతీయ స్థాయి ఫోరెన్సిక్ నిపుణులతో రిపోర్టు తయారు చేయించారు. ఇందులో ముంబై పోలీసుల వాదనతో ఏకీభవించని వారు, ముంబై పోలీసుల వాదనను తప్పుపట్టారు. ఏదేమైనా, ఈ కేసును హత్య అనదగ్గ ఆధారాలేవీ లేవని నెల రోజుల క్రితమే సీబీఐ ముంబై హైకోర్టుకు తెలిపింది. కానీ తాజాగా బ్రిటన్‌ పేన్‌-జేమ్స్‌ ఫొరెన్సిక్‌ నివేదిక మాత్రం కొన్ని షాకింగ్‌ విషయాలు వెల్లడించింది. జియా హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించారని ప్రకటించింది. పేన్‌ జేమ్స్‌ స్టేట్‌మెంట్‌ను మిర్రర్‌ పత్రిక ప్రచురించింది.

  అనుమానాలకి తావిస్తుంది:

  అనుమానాలకి తావిస్తుంది:

  జియా శరీరం మీద మీద ఉన్న గుర్తులకు, ఆత్మహత్యకి పొంతన కుదరడం లేదు. అంతె కాదు ఆమె మరణం నాటి పరిస్థితులు కూడా అనుమానాస్పదం గానే ఉన్నాయి. ఈమె సీలింగ్ ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు కనిపించింది, కానీ ఆ ఫ్యాన్ అందాలంటే కింద ఒక కుర్చీ అయినా ఉండాలి. వారి ఇంట్లో ఒక్క కుర్చీ కూడా లేకపోవడం అసలు అంత ఎత్తుని అందుకోగలిగే ఏవస్తువూ అక్కడ లేకపోవటం ట్విస్ట్. అంతేగాక ఎసి రూమ్ కిటికీ తెరిచి ఉండడం మరిన్ని అనుమానాలకి తావిస్తుంది.

  రేపుముంబై హై కోర్టు:

  రేపుముంబై హై కోర్టు:

  ఈ విషయాలన్నీ చూస్తుంటే జియా ఖాన్ హత్యకు గురయ్యిందన్న అనుమానాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఎవరో జియా ఖాన్ ని చంపేసి ఫ్యాన్ కి వేలాడదీసి, ఎవరి కంటా పడకుండా కిటికీ నుంచి దూకి తప్పించుకుని ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఈ రిపోర్ట్ రేపుముంబై హై కోర్టు కి చేర నుంది . జియా ఖాన్ మెడపై , కింది దవడ దగ్గర ఉన్న మచ్చలు చున్నీ వల్ల వచ్చినవి కావని అలాగే కింది పెదవి పై ఉన్న గాయం కూడా సాధారణంగా జరిగింది కాదని ఏదైనా వస్తువు బలంగా తాకడం వల్ల కానీ లేదా బలంగా వత్తడం వల్ల కానీ జరిగింది అని రిపోర్ట్ ఇచ్చింది దాంతో జియా ఖాన్ ది హత్యే అని అంటున్నారు . మరి కోర్టు ఏం తేలుస్తుందో చూడాలి .

  ఆత్మహత్య కాదన్న నిర్ధారణ:

  ఆత్మహత్య కాదన్న నిర్ధారణ:

  పేన్‌-జేమ్స్‌.... జియా పోస్ట్‌ మార్టెమ్‌ రిపోర్టులు, ఆమె శరీర చిత్రాలను మరింత లోతుగా స్టడీ చేసింది. ఆమెది ఆత్మహత్య కాదన్న నిర్ధారణకు వచ్చింది. కింది పెదవిపై ఉన్న గాయం ఉరి వేసుకోవడం వల్ల ఏర్పడింది కాదని ఎవరో ఆమె నోరు నొక్కడం వల్లగానీ బలమైన వస్తువుతో కొట్తడం వల్ల గానీ ఏర్పడి ఉంటుందని తేల్చింది. ఇక ఉరి కారణంగా మెడపై ఏర్పడ్డ మచ్చపైనా పేన్స్‌-జేమ్స్‌ నిపుణులు సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

  కొత్త మలుపులు:

  కొత్త మలుపులు:

  ఫైనల్‌గా జియాది ఆత్మహత్య కాదని తేల్చేశారు. జియా ఖాన్ మెడ, దవడలపై కనిపించిన గాయాలు చున్నీ కారణంగా అయినవి కాదని బలంగా చెప్తున్నారు. ఈ మేరకు ఆ సంస్థ రూపొందించిన రిపోర్టును జియా తల్లి రబియా అమిన్ బుధవారం నాడు బాంబే హైకోర్టులో దాఖలు చేయనున్నారు. దీంతో దాదాపు విచారణ పూర్తి కావచ్చిన ఈ కేసు కొత్త మలుపులు తిరిగే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

  క్రేజీ స్టార్ గా ఎదిగి:

  క్రేజీ స్టార్ గా ఎదిగి:

  అరంగేట్రంలోనే 'నిషబ్ద్'లో అమితాబ్ బచ్చన్ తో కలిసి రొమాన్స్ పండించి, అనతికాలంలోనే క్రేజీ స్టార్ గా ఎదిగిన జియా ఖాన్.. 2013, జూన్ లో ముంబై జుహులోని తన అపార్ట్ మెంట్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించారు.ఆసుపత్రికి తీసుకెళ్లేసరికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. బాలీవుడ్ వెటరన్ నటుడు ఆదిత్యా పాంచోలి తనయుడు సూరజ్ పాంచోలి- జియాల మధ్య పీకల్లోతు ప్రేమాయణం నడిచింది. ఇద్దరూ గొడవ పడిన సందర్భంలో సూరజ్.. జియాను చంపేశాడనే ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. కేసు తీవ్రత దృష్ట్యా బాంబే హైకోర్టు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించింది. ఒక దశలో సూరజ్ పాంచోలీని అరెస్ట్ చేసి విచారించారు. ప్రస్తుతం బెయిల్ పై ఉంటోన్న సూరజ్ పలు సినిమాల్లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే..

  చిత్రహింసలు అనుభవించాను:

  చిత్రహింసలు అనుభవించాను:

  ఆత్మహత్య చేసుకోవడానికి ముందు జియా రాసిన ఐదు పేజీల లేఖను చదివితే ఎవరి హృదయమైన బరువెక్కక మానదు. అందులో జియా ఆవేదన ఆమె మాటల్లోనే... ‘నిన్ను తొలిసారిగా కలిసినప్పుడు అలా చూస్తూనే ఉండిపోయా. ఆ తర్వాత నీ ప్రేమలో పడిపోయా. విధి మనిద్దరిని ఎందుకు కలిపిందో తెలియలేదు. నీతో సహవాసం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అత్యాచారానికి గురయ్యాను.,,చిత్రహింసలు అనుభవించాను. ఇవన్నీ నీకెలా చెప్పాలో తెలియలేదు. కానీ ఇప్పుడు ఇంకా కోల్పోయేదేమీ లేదని నిర్ణయించుకున్నా.

  నన్ను హింస పెట్టావు:

  నన్ను హింస పెట్టావు:

  నీవల్ల అన్నింటినీ కోల్పోయాను. నీవు ఈ లేఖ చదివే సమయానికి బహుశా నేను వెళ్లిపోతానేమో..! నా అంతరంగం బద్ధలైంది. నిన్ను ప్రేమించడం వల్లే ఇది జరిగిందనే విషయం నీకు తెలియకపోవచ్చు. ప్రతిరోజు నన్ను హింస పెట్టావు. అయినా నా సర్వస్వం నీకు అర్పించాను. నన్ను గర్భవతిని చేశావు. అయినా నా పదేళ్ల కెరీర్‌ను, నా కలలను వదులుకునేందుకు సిద్ధపడ్డాను. ఇవన్నీ నీకెప్పుడూ చెప్పలేదు.

  నా జీవితాన్ని నాశనం చేశావు:

  నా జీవితాన్ని నాశనం చేశావు:

  అయితే నీ గురించి నాకోవిషయం తెలిసింది. నీవు స్త్రీలోలుడవు. నీవు నన్ను మోసం చేశావు. నా జీవితాన్ని నాశనం చేశావు. నీవల్ల కడుపులో ఉన్న బిడ్డను చంపుకున్నా. అప్పుడెంత క్షోభను అనుభవించానో నీకు తెలియదు. నీవు నన్ను దూరంగా పెట్టడం నన్ను మరింతగా బాధించింది. నా క్రిస్మస్‌ను, నా జన్మదినాన్ని నాశనం చేశావు. బతికేందుకు నాకు ఎటువంటి కారణం కనబడడంలేదు. ఇంకెందుకు బతకాలి?' అని జియా ఆ లేఖలో పేర్కొంది.

  English summary
  The newest twist in the Jiah Khan case comes in the form of the findings by UK-based forensic expert Jason James-Pynes. The report by James-Pynes raises questions about the accuracy of the CBI’s investigations, saying that Jiah Khan’s “hanging was staged”.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X