రేపటి వరకు షూటింగులు రద్దు
దర్శక రత్న దాసరి నారాయణ రావు భార్య, సినీ నిర్మాత దాసరి పద్మ(65) శుక్రవారం మరణించారు. గత కొంత కాలంగా ఊపిరి తిత్తుల వ్యాధితో బాధ పడతున్న ఆమె యశోధ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు. పద్మ మరణంతో సినీ వర్గాల్లో విషాదం నెలకొంది. ఆమె మృతికి సంతాపంగా శనివారం మధ్యాహ్నం వరకు షూటింగులు రద్దు చేస్తున్నట్లు తెలుగు సినీ సమాఖ్య ప్రకటించింది.
పద్మ మరణం తెలియడంతో సీఎం కిరణ్ దాసరి ఇంటికి చేరుకుని ఆయన్ను ఓదార్చారు. మంత్రులు దానం నాగేందర్, ఏరాసు ప్రతాపరెడ్డి, మోహన్ బాబు, కృష్ణ దంపతులు, జయసుధ, రోజా, కవిత, కళ్యాణ్ రామ్, అశ్వినీ దత్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు దాసరి నివాసానికి చేరుకుని పద్మ మృతదేహానికి నివాళులర్పించారు.
దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన శివరంజని, మేఘ సందేశం, ఒసేయ్ రాములమ్మ, మజ్ను, ఒరేయ్ రిక్షా సినిమాలకు పద్మ నిర్మాతగా వ్యవహరించారు. అంతే కాకుండా తమిళనాడు మహిళా కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశారు.


Click it and Unblock the Notifications











