»   » మంచు మనోజ్ ‘శౌర్య’ థ్రిల్లింగ్ లవ్ స్టోరీ (ఫోటోస్)

మంచు మనోజ్ ‘శౌర్య’ థ్రిల్లింగ్ లవ్ స్టోరీ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు మనోజ్, రెజీనా జంటగా దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి ‘శౌర్య' అనే టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ లోగో లాచింగ్ కార్యక్రమం గురువారం హైదరాబాద్ లో జరిగింది. బేబి త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్ టైన్ మెంట్స్ ఇండియా ప్రై.లిమిటెడ్ బ్యానర్ మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పార్లమెంట్ సభ్యుడు వి.బి.పాటిల్ చేతుల మీదుగా ‘శౌర్య' ఫస్ట్ లుక్ లోగో విడుదల చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ - ''శౌర్య థ్రిల్లింగ్ లవ్ స్టోరీ. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తయ్యింది. మనోజ్, రెజీనా అద్భుతంగా నటిస్తున్నారు. డిసెంబర్ 6 తో షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అదే నెలాఖరుకు సినిమా ఫస్ట్ కాపీని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.

మనోజ్ మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో నేను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రను చేస్తున్నాను. థ్రిల్లింగ్ లవ్ స్టోరీ. ఇప్పటివరకూ నేను చేసిన చిత్రాలు మాస్ ఎంటర్ టైనర్స్. మా డైరెక్టర్ దశరథ్ గారికి క్లాస్ ఇమేజ్ ఉంది. సో.. మా కాంబినేషన్ సినిమాపై అందరిలోనూ ఆసక్తి ఉంది అన్నారు. మేజర్ చంద్రకాంత్ లో నాకు అమ్మగా నటించిన సుధగారు ఈ చిత్రంలో నాకు అత్తగా నటిస్తోంది. రెజీనా మంచి కోస్టార్, చక్కగా నటిస్తుంది అన్నారు.

డిఫరెంట్ మూవీ

డిఫరెంట్ మూవీ

శౌర్య అనేది డిఫరెంట్ సినిమా, అందరికీ నచ్చే విధంగా ఉంటుందని మనోజ్ తెలిపారు.

విడుదల

విడుదల

జనవరిలో సినిమాని విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నాం'' అని నిర్మాత తెలిపారు.

నటీనటులు

నటీనటులు

ప్రకాష్‌ రాజ్‌, బ్రహ్మానందం, షాయాజీషిండే, సుబ్బరాజు, నాగినీడు, శ్రవణ్‌, బెనర్జీ, జి.వి., ప్రభాస్‌ శ్రీను, షకలక శంకర్‌, సత్యప్రకాష్‌, సూర్య, శివారెడ్డి, సుధ, మధుమణి, హేమ, సంధ్యాజనక్‌, చంద్రకాంత్‌, రూప తదితరులు నటిస్తున్నారు.

తెర వెనక

తెర వెనక


ఈ చిత్రానికి స్టంట్స్‌: వెంకట్‌, కొరియోగ్రఫీ: భాను, ఆర్ట్‌: హరిబాబు, రచనా సహకారం: హరికృష్ణ, సాయికృష్ణ, స్క్రీన్‌ప్లే: గోపు కిషోర్‌, రచన: గోపి మోహన్‌, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: వేదా.కె, సినిమాటోగ్రఫీ: మల్హర్ భట్‌ జోషి, నిర్మాత: శివకుమార్‌ మల్కాపురం, దర్శకత్వం: దశరథ్‌.

English summary
Manchu Manij's Shourya first look launch event held at Hyderabad.
Please Wait while comments are loading...