»   » నిజమే: హీరో అవ్వాలకున్న రాజమౌళి: ‘షో టైమ్’(టీజర్)

నిజమే: హీరో అవ్వాలకున్న రాజమౌళి: ‘షో టైమ్’(టీజర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి ఫ్యామిలీకి చెందిన వారిలో రచయిత ఎస్ఎస్ కాంచి గురించి అందరికీ తెలిసిందే. తాజాగా ఎస్‌ఎస్ కాంచి దర్శకత్వంతో 'షో టైమ్' అనే సినిమా వస్తోంది. 'సినిమా థియేటర్‌కి వచ్చే వారందరూ సినిమా చూడడానికే కాదు' అంటూ ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసారు. రాజమౌళి చేతుల మీదుగా రిలీజైన ఈ టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేలా చేసింది.

రణ్‌ధీర్, రుక్సార్ కీలక పాత్రల్లో కనపడనున్న ఈ సినిమాను రమా రీల్స్ పతాకంపై సుధీర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సునీల్ నటించిన 'మర్యాద రామన్న', సుమంత్ హీరోగా వచ్చిన 'ఏమో గుర్రం ఎగరా వచ్చు' సినిమాలకు కథ, మాటలు అందించిన కాంచి మెగాఫోన్ పట్టాలని ఎన్నాళ్ళ నుండో ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్ళకి 'షో టైమ్'తో ఆయన యత్నాలు ఫలించాయి. ఈ సినిమాకు రాజమౌళి ఫ్యామిలీలో పెద్దన్న కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

'షో టైమ్' ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.....''మా ఫ్యామిలీలో మేం 13 మంది కజిన్స్‌ ఉండేవాళ్ళం మా అందరికీ అన్నయ్య కీరవాణి రాజు అయితే కాంచీ మంత్రిలా ఉండేవారు. అందువల్ల నాకు కాంచీ అన్నయ్య అంటే భయంగా ఉండేది. ఇక షో టైం అంటే నాకు చిన్నప్పుడు ఓ విషయం గుర్తుకు వచ్చేది. అందరినీ నెలకొకసారి సినిమాకు తీసుకెళ్లేవారు. అందరం సినిమాకు బయలుదేరేటప్పుడు రాజన్నయ్య బాత్రూమ్‌ వెళితే వీడితో పెట్టుకోకూడదు అంటూ తిట్టుకునేవారు. ఆ విషయం నాకు గుర్తుకు వచ్చింది.

హీరో కావాలని కలలుగన్నానంటూ రాజమౌళి చెప్పిన మరిన్ని ఆసక్తికర విషయాలు, షో టైమ్ టీజర్ స్లైడ్ షోలో...

హీరో కావాలని...

హీరో కావాలని...

‘నేను టీనేజ్‌ లో ఉన్నప్పుడు హీరో కావాలనుకుని పల్లెటూర్లోని గుడిలో కూర్చొని పూజలు చేస్తుండేవాడిని. హీరో కావాలనుందని ఎవరికీ సిగ్గుతో చెప్పేవాడిని కాను' అని రాజమౌళి తెలిపారు.

ఓ రోజు అన్నయ్యకు చెప్పా..

ఓ రోజు అన్నయ్యకు చెప్పా..

అయితే ఓ రోజు కాంచీ అన్నయ్య నన్ను పిలిచి ఏమవుతామని అనుకుంటున్నావని అడిగాడు. నేను హీరో కావాలనుందని చెప్పాను. అప్పుడు తిట్టకుండా హీరో కావాలంటే ఇలా పల్లెటూళ్ళో ఉండకూడదు. సినిమాల్లో ఉంటేనే నువ్వు అనుకున్నది సాధిస్తావని చెప్పారు అని రాజమౌళి తెలిపారు.

కాంచీ అన్నయ్య గురించి...

కాంచీ అన్నయ్య గురించి...

అలా కాంచీ అన్నయ్య నాకు గైడ్‌ అయ్యారు. ఇక మా ఫ్యామిలీలో అన్నీ విషయాలు తెలిసిన వ్యక్తి కాంచీ అన్నయ్యే. ఏ విషయంపై అయిన ఆయనకు అవగాహన ఉంటుంది. సాధారణంగా నా సినిమాలో తప్పులను ఇట్టే పట్టేస్తుంటారు. ఎలా చేయాలో కూడా చెబుతుంటారు. అందుకే ఆయన్ను సర్వజ్ఞుడు అంటుంటాం అని రాజమౌళి తెలిపారు.

థ్రిల్లర్ సబ్జెక్ట్

థ్రిల్లర్ సబ్జెక్ట్

నిజానికి ఆయన ఎప్పుడో డైరెక్టర్‌ కావాల్సింది కానీ ఇప్పుటికీ కుదరింది. అసలు అన్నయ్య ఎలాంటి సినిమాను చేస్తాడోనని ఆసక్తిగా ఉండేది. ఇప్పుడు ఆయన థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నారు. అలాగే సినిమా ఫస్ట్‌లుక్‌తో ఇంప్రెషన్‌ క్రియేట్‌ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ట్రైలర్‌, సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నాను. నిర్మాతలకు, యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు రాజమౌళి.

rn

షో టైం టీజర్

షో టైం టీజర్

English summary
Show Time First Look Teaser. The movie directed by SS Kanchi, Randheer and Ruksaar in lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu