»   »  శ్రధ్దా 'ఆర్య-2'

శ్రధ్దా 'ఆర్య-2'

Posted By:
Subscribe to Filmibeat Telugu
Shraddha Arya
ఇదేమీ కొత్త సినిమా టైటిల్ కాదు. సుకుమార్ రూపొందిస్తున్న 'ఆర్య' సినిమా సీక్వెల్ లో శ్రద్దా ఆర్య ఎంపికైన సంగతి. ఇంతకీ ఆమె గుర్తొచ్చిందా...'గొడవ' సినిమాలో తన అందాలను తడి,పొడిగా మొహమాటం లేకుండా ఆరబోసిన ముంబాయి భామ. సినిమా కొదండ రామి రెడ్డికి, ఆయన కుమారుడు వైభవ్ కి పెద్దగా పనికి రాకపోయినా శ్రధ్ధా ఆర్యకి ఆఫర్లు తెచ్చిపెడుతోంది.

ప్రస్తుతం శ్రధ్ధా ఆర్యకు తెలుగులో వరస ఆఫర్లు వస్తున్నాయి. అందులో ఆమె అలవోకగా అందాలు ఆరబోసి అందరినీ ఆకట్టుకుంది. దాంతో దర్శక, నిర్మాతల దృష్టి ఆమెపై పడింది. మరో ప్రక్క ఆమె రెమ్యునేషన్ బాగా ఎక్కువ, డిమాండ్స్ తో అందరనీ ఆడుకుంటుందని బేడ్ నేమ్ ఉన్నా అవేమీ సినిమాలు రప్పించడంలో అడ్డంకి కావటం లేదు. తాజాగా ఆమె మళయాళ 'హలో' చిత్రం రీమేక్ లో రాజశేఖర్ కి జోడిగా చేయటానికి కమిటయ్యింది.

దానికి రామ్ ప్రసాద్ దర్శకుడు. అలాగే ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో రెడీ అవుతున్న 'ఆర్య -2' కి ఎంపిక చేసారని తెలుస్తోంది. ఆ సినిమాలో ఆల్రెడీ కాజల్ మెయిన్ హీరోయిన్ గా సెలక్టయిందనే సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఈ సినిమాలో వెరైటీ గెటప్ లో కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X