»   » అర్నాబ్ గోస్వామిలా... జర్నలిస్టు పాత్రలో శ్రద్ధా దాస్!

అర్నాబ్ గోస్వామిలా... జర్నలిస్టు పాత్రలో శ్రద్ధా దాస్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజశేఖర్ హీరోగా, చందమామ కథలు, గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైన‌ర్ "పి.ఎస్.వి గరుడ వేగ 126.18 ఎం" . ప్ర‌స్తుతం సినిమా హైదరాబాద్ పాత బస్తి లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. రాజ‌శేఖ‌ర్ ఈ చిత్రంలో ఎన్ఐఎ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రాజ‌శేఖ‌ర్ కెరీర్‌లోనే పాతిక కోట్ల‌కు పై భారీ బ‌డ్జెట్‌తో సినిమా రూపొందుతుంది. మెయిన్ విల‌న్ జార్జ్ పాత్ర‌లో కిషోర్ న‌టిస్తున్నాడు. హీరోయిన్ పూజా కుమార్, రాజ‌శేఖ‌ర్ భార్య పాత్ర‌లో న‌టిస్తుంది.

ఈ చిత్రంలో హీరోయిన్ శ్ర‌ద్ధాదాస్ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. గుంటూరు టాకీస్ చిత్రంలో శ్ర‌ద్ధాదాస్ హిలేరియ‌స్ గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లో న‌టించిన శ్ర‌ద్ధాదాస్ ఈ చిత్రంలో మ‌రో డిఫ‌రెంట్‌గా కాంటెంప‌ర‌రీ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌న‌ప‌డనుంది. ప్ర‌ముఖ పాత్రికేయుడు అర్నాబ్ గోస్వామి వ‌లే తాను కూడా కావాల‌ని క‌ల‌లు క‌నే ఓ యంగ్ జ‌ర్న‌లిస్ట్ మ‌నాలిగా శ్ర‌ద్ధాదాస్ ఈ చిత్రంలో కనిపించబోతోంది. బేసిక్‌గా శ్ర‌ద్ధాదాస్ జ‌ర్న‌లిజం స్టూడెంట్ కావ‌డంతో శ్ర‌ద్ధా పాత్ర‌లో ఒదిగిపోయిందని అంటున్నారు చిత్ర యూనిట్.


Shraddha as journo Malini in 'PSV Garuda Vega'

అదిత్ సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్‌గా కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. స‌న్నిలియోన్ స్పెష‌ల్ సాంగ్ సినిమాకు ప్ల‌స్ అవుతుంది. నాజ‌ర్‌, చ‌ర‌ణ్ దీప్ త‌దిత‌రులు రాజ‌శేఖ‌ర్ ఎన్ఐఎ టీం స‌భ్యులుగా న‌టిస్తున్నారు. ఆద‌ర్శ్‌, శ‌త్రు, ర‌విరాజ్‌లు ప్రొఫెష‌న‌ల్ కిల్ల‌ర్స్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నారు. శ్రీనివాస్ అవ‌స‌రాల కామెడి పాత్ర పోషిస్తున్నాడు. అలీ సైకాల‌జిస్ట్ పాత్ర‌లో, పృథ్వీ నింఫోమానియ‌క్ పేషెంట్‌గా, పోసాని కృష్ణ‌ముర‌ళి, షాయాజీ షిండే పొలిటిషియ‌న్స్ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.


ఈ చిత్రానికి సంగీతంః శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ః భీమ్స్‌, సినిమాటోగ్ర‌ఫీః అంజి, గికా చెలిడ్జే, బకూర్ చికోబావా, సురేష్ ర‌గుతు, శ్యామ్‌, ఎడిటింగ్ః ధ‌ర్మేంద్ర కాక‌రాల‌, ఆర్ట్ః శ్రీకాంత్ రామిశెట్టి, స్టంట్స్ః నూంగ్‌, డేవిడ్ కుబువా, స‌తీష్‌, బాబీ అంగారా. పి ఆర్ ఓ : బియాండ్ మీడియా (నాయుడు - ఫణి)


English summary
Praveen Sattaru-directed 'PSV Garuda Vega' stars Dr. Rajsekhar as an NIA officer. The high-budgeted movie throws up a range of interesting characters, mainly the menacing villain George (Kishore of 'Kabali' fame) and the not-so-regular housewife of the main lead, Pooja Kumar (of 'Vishwaroopam' fame). Shraddha Das, who played a hilarious lady gangster in 'Guntur Talkies', will be seen in a contrasting role in this entertainer. The director has envisioned her in the role of a contemporary journalist who is always keen to break the biggest story out there. That's an Arnab Goswami in the making for you!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu