»   » సెక్స్ కామెడీ సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది

సెక్స్ కామెడీ సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘గ్రాండ్ మస్తీ' పేరుతో లో విడుదలైన బాలీవుడ్ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. సెక్సీ కమెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్ ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరుస్తూ .. 100 కోట్ల క్లబ్ లో చేరింది. పెద్దలకు మాత్రమే పరిమితమైన బూతు కామెడీతో తెరకెక్కిన ఈ సినిమా వంద కోట్లు కొల్లగొడుతుందనీ ఎవరూ ఊహించలేకపోయారు.

ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ రాబోతోంది. ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ' పేరుతో తెరకెక్కే ఈ సీక్వెల్లో రితేష్ దేష్ ముఖ్, వివేక్ ఓబెరాయ్, ఆఫ్తాబ్ కనిపించనున్నారు. ఇంద్రకుమార్ తెరకెక్కించే ఈ సినిమాకు ఎక్తా కపూర్ సహనిర్మతగా వ్యవహరించనుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది.

Shraddha Das signed for Great Grand Masti

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ'లో హీరోయిన్ శ్రద్ధా దాస్ కూడా హీరోయిన్ గా ఎంపికయింది. . ఈ సందర్భంగా శ్రద్ధాదాస్ మాట్లాడుతూ గ్రాండ్ మస్తీ చిత్రానికి సీక్వెల్‌గా గేట్ గ్రాండ్ మస్తీ రూపొందుతోంది. ఇటీవలే ఈ చిత్రాన్ని అంగీకరించినట్లు వెల్లడించింది.

ముగ్గురు కథానాయికల్లో నేను ఓ నాయికగా కనిపిస్తాను. నటనకు అవకాశమున్న పాత్ర నాది. చాలా వినోదభరితంగా వుంటుంది. రితేష్ దేశ్‌ముఖ్, వివేక్ ఓబెరాయ్, అఫ్తాబ్ శివదాసనిల కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. వారితో కలిసి కామెడీని పండించడం కొత్తగా వుంది అని అని తెలిపింది.

English summary
The beautiful Shraddha Das, who was seen in films Lahore and Dil Toh Bachha Hai Ji, is now all set to be seen in Great Grand Masti.
Please Wait while comments are loading...