»   » "అక్క" గా గుర్తుంటే పేరుతో పనిలేదు: దావుద్ చెల్లెలి సినిమా టీజర్ అమేజింగ్ (వీడియో)

"అక్క" గా గుర్తుంటే పేరుతో పనిలేదు: దావుద్ చెల్లెలి సినిమా టీజర్ అమేజింగ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా జీవిత నేపథ్యంలో 'హసీనా-ది క్వీన్‌ ఆఫ్‌ ముంబయి' అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హసీనా పార్కర్ పాత్రని శ్రద్ధా కపూర్ పోషిస్తుండగా, దావూద్ పాత్రలో శ్రద్దా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ నటిస్తున్నాడు. ఈ సినిమా దావూద్ ఇబ్రాహిం సోదరీమణి హసీనా పర్కర్ జీవితం ఆధారంగా ఉంటుంది.

ఆమె జీవితంలో కొంత భాగం తెర పై చూపించబోతున్నారు.హసీన జీవితం పూర్తి ఎమోషనల్. ఓ వైపు అన్న పెద్ద డాన్. అతడికి చెల్లిగా ముంబైలో బతకాలంటే తను అంతకుమించిన డాన్ అయితేనే సాధ్యం. అందుకే ముంబై లోని ఓ ఏరియాలో ఈవిడను క్వీన్ గా ఆరాధించేవారు.హసీనా.. దావూద్ ముంబై వ్యాపారాలను, అక్రమ ఆస్తులను చూసేదని సమాచారం. నాగ్‌పాడాలోని గార్డన్ హాల్ అపార్టుమెంట్‌లో విలాసవంతమైన ఫ్లాట్‌లో ఉంటున్న ఆమెకు లేడీ డాన్‌గా గుర్తింపు ఉంది.

ఈ సినిమా టీజర్ విడుదలై ఇప్పుడు యూట్యూబ్ లో సుడిగాలి సృష్టించింది. మొదటిసారి పోస్టర్ విడుదల చేసిన్నప్పటి నుండి వస్తున్న మాటలు ఇప్పుడు నిజం అయ్యాయి. ట్రైలర్ లో ఇది పూర్తిగా హసీనా స్థాయిలో ఆమెకున్న పవర్ను చూపించే విధంగా మేకింగ్ చేశారనే చెప్పాలి. మీ గుర్తింపు అనేది మీ పేరు బట్టి ఉంటుంది. కానీ ఈమె పేరు ఈమె అన్నయ్య పేరుతో ముడిపడి ఉంటుంది అని మొదలుపెట్టి ఆమె ఎవరో అందరికి పరిచయం చేస్తూ చెల్లిగా భార్యగా అమ్మగా ఆమెలో ఆడతనాన్ని లోకానికి చెబుతూ గాడ్ మదర్ గా ఎలా ఎదిగింది అని చూపించారు. ఆపా (అక్క) గా గుర్తున్నంత కాలం పేరు గుర్తుపెట్టుకోవాలిసిన పని లేదు అని ఆమె కథ ఎంత తెర వెనుక జరిగిందో చెప్పకనే చెప్పారు.

English summary
Shraddha Kapoor-starrer explains the life of Haseena well, popularly known as 'Aapa', a name that sent shivers down the spine of people living in Mumbai. Directed by Apoorva Lakhia, the film shows Shraddha in a completely different avatar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X