»   »  సైనా కోసం శ్రద్దా పోరాటం, మరో సెన్సేషన్ బయోపిక్ తో బాలీవుడ్ సిద్దం

సైనా కోసం శ్రద్దా పోరాటం, మరో సెన్సేషన్ బయోపిక్ తో బాలీవుడ్ సిద్దం

Posted By:
Subscribe to Filmibeat Telugu

బయోపిక్ ఈ మధ్య కాలం లో ఒక మెగా హిట్ ఫార్ములా, ఇండియన్ సినిమా ఇప్పుడు ప్రముఖుల జీవితాల చుట్టూ తిరుగు తోంది ఇందులో సింహ భాగం క్రీడా కారులదే, ఒకప్పటి, ఇప్పటి సక్సెస్ఫుల్ క్రీడా కారుల జీవిత చరిత్రలని సిమాగా తెరమీదకి తెచ్చి లాభాల పంట పండిస్తున్నారు మూవీ మేకర్స్. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మీద వచ్చిన సినిమా తప్ప దాదాపుగా ఈ ట్రెండ్ లో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ హిట్లు గానే నిలిచాయి...

దంగల్

దంగల్

మహావీర్ సింగ్ పోగట్ అనే ఒక రెజ్లర్ జీవితకథని దంగల్ గా నిర్మించిన ఆమీర్ఖాన్ ఇప్పటికే ఇండియన్ సినిమాని బంగారు కాసుల వర్షం తో అభిషేకించాడు. వంద కోట్ల క్లబ్ లో చేరటమే ఒక అచీవ్ మెంట్ అనుకుంటున్న సమయం లో వేల కోట్ల టర్నోవర్ తో సిల్వర్ స్క్రీన్ కి బంగారు పూత పూసాడు. ఇక ఇప్పట్లో ఈ ట్రెండ్ ఆగేలా కనిపించటం లేదు.

బ్యాడ్మింటన్ తార సైనా నెహ్వాల్‌

బ్యాడ్మింటన్ తార సైనా నెహ్వాల్‌

ఈ ట్రెండ్ లో భాగం గానే బ్యాడ్మింటన్ తార సైనా నెహ్వాల్‌ జీవిత కథ సినిమాగా రూపుదిద్దుకుంటోంది. ఈ బయోపిక్‌లో సైనా పాత్రను శ్రద్ధాకపూర్‌ పోషించనుంది. స్వతహాగా స్పోర్ట్స్‌ లవర్‌ కావడంతో ఈ అవకాశం రావడంతో శ్రద్ధా సంతోషంతో ఉప్పొంగిపోతోంది. స్కూల్‌లో చదువుకొనే రోజుల్లో ఫుట్‌బాల్‌, బాస్కెట్‌ బాల్‌, బ్యాడ్మింటన్ ఆడిన అనుభవం ఉందామెకి.

సైనా పాత్ర కోసం

సైనా పాత్ర కోసం

అయితే పెద్దయ్యాక, సినిమాల్లోకి వచ్చాక ఆ ఆటలు ఆడే తీరిక లేక వాటికి దూరమైంది. ఇప్పుడు ఈ సినిమా పుణ్యమాని పాత రోజులను మళ్లీ గుర్తు చేసుకొంటూ సైనా పాత్ర కోసం సిద్ధమవుతోంది. ఓ స్పోర్ట్స్‌ స్టార్‌ గురించి తీసే సినిమాలో హీరోయిన్ పాత్ర అంటే మాటలు కాదుకదా.

ప్రకాశ్ పడుకోన్ అకాడెమీ

ప్రకాశ్ పడుకోన్ అకాడెమీ

అందుకే సైనా పాత్రలో జీవించడం కోసం ట్రైనింగ్‌ అవుతోంది. ప్రకాశ్ పడుకోన్ అకాడెమీకి చెందిన సీనియర్‌ కోచ్ రోజూ శ్రద్ధాకపూర్‌కి శిక్షణ ఇస్తున్నారు. ఈ బయోపిక్‌ నిర్మాణం ఈ ఏడాది చివరిలో ప్రారంభమవుతుంది. భూషణ్‌కుమార్‌ నిర్మించే ఈ చిత్రానికి అమోల్‌ గుప్తా దర్శకుడు.

English summary
Shraddha Kapoor started off her year with Ok Jaanu, starring Aditya Roy Kapoor, now after the release of Half Girlfriend and wrapping up Haseena: The Queen of Mumbai, she is getting her hands on the first biopic of her career which is based on the life of young badminton icon Saina Nehwal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu