»   » ‘రెడ్డి’ పదం వాడటంపై యాంకర్ కామెంట్, హీరోయిన్ మీద సెటైర్లు!

‘రెడ్డి’ పదం వాడటంపై యాంకర్ కామెంట్, హీరోయిన్ మీద సెటైర్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Anchor Hot Comments On "Arjun Reddy "

'అర్జున్ రెడ్డి' సినిమాకు థియేటర్ వద్ద వసూళ్లు ఎంతబాగా వస్తున్నాయో... అదే స్థాయిలో థియేటర్ బయట వివాదాలు, విమర్శలు కూడా వస్తున్నాయి. సినిమా రిలీజ్ ముందు నుండే వి.హనుమంతరావు ఆందోళన, విడుదలైన తర్వాత కొందరు సినిమాలో బూతులు, అసభ్య పదాలు ఉన్నాయంటూ విమర్శించిన సంగతి తెలిసిందే.

ప్రముఖ యాంకర్ అనసూయ కూడా ఇటీవల 'అర్జున్ రెడ్డి' సినిమా మీద ఫైర్ అయింది. సినిమాలో బూతు పదజాలం వాడటం, మహిళలను, అమ్మను కించ పరిచే విధంగా తిట్లు, సీన్లు ఉండటంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

నటి, యాంకర్ శ్రావ్య రెడ్డి ఫైర్

నటి, యాంకర్ శ్రావ్య రెడ్డి ఫైర్

తాజాగా ‘అర్జున్ రెడ్డి' సినిమాపై నటి, యాంకర్ శ్రావ్య రెడ్డి ఫైర్ అయ్యారు. ఆమె అభ్యంతరం సినిమాలోని సీన్ల మీదో, అందులో వాడిన పదజాలం మీదనో కాదట. సినిమా టైటిల్ విషయంలోనే ఆమె అభ్యంతరం. టైటిల్‌లో ‘రెడ్డి' అనే పదం వాడటంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

తలనొప్పి సినిమా

తలనొప్పి సినిమా

సినిమా చూస్తున్నపుడు చాలా తక్కువ సందర్భాల్లో నాకు తలనొప్పి వస్తుంది. అలాంటి తలనొప్పి తెప్పించే సినిమాల్లో ‘అర్జున్ రెడ్డి' సినిమా ఒకటి అంటూ సినిమాపై తన అసంతృప్తిని వెల్లగక్కింది.

రెడ్డి కాదు దేశ్ ముఖ్

రెడ్డి కాదు దేశ్ ముఖ్

‘సినిమాలో హీరో పేరు అర్జున్ రెడ్డి దేశ్‌ముఖ్.... అంటే అతడు దేశ్‌ముఖ్. ‘రెడ్డి' లకు దేశ్ ముఖ్ అని ఉండదు. అసలు అతడు ‘రెడ్డి' కాదు... ‘దేశ్‌ముఖ్' అని తెలిపారు. మీరు ఈ సినిమాకు టైటిల్ పెట్టాలంటే అర్జున్ దేశ్‌ముఖ్ రెడ్డి అని పెట్టాల్సింది, అర్జున్ రెడ్డి దేశ్ ముఖ్ కాదు...... ఐ హేట్ ఇట్.' అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

ఆ హీరోయిన్ ఫేసుకు అంత సీన్ లేదు

ఆ హీరోయిన్ ఫేసుకు అంత సీన్ లేదు

ఆ హీరోయిన్ ఫేసుకు..... యుద్ధం చేసేంత, డ్రగ్ ఎడిక్ట్ అయ్యేంత సీన్ లేదు అంటూ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన శాలిని పాండేను ఉద్దేశించి..... శ్రావ్య రెడ్డి కామెంట్ చేశారు.

డైరెక్టర్ మీద కూడా...

డైరెక్టర్ మీద కూడా...

ఈ సినిమతో మీరు ఏం చెప్పాలనుకున్నారండీ డైరెక్టర్ గారు..? లవ్ ఫెయిల్ అయితే లైఫ్ నాశనం చేసుకోవడం అనా? అంటూ.... దర్శకుడి మీద కూడా విమర్శలు చేశారు శ్రావ్య రెడ్డి

English summary
Actress Shravya Reddy said that ‘Arjun Reddy’ is one of those rare films that gave her headache. She criticize the makers for choosing ‘Arjun Reddy’ title for the film. ‘How could the film be named ‘Arjun Reddy’ when the actual name of the protagonist in the film is Arjun Reddy Deshmukh. He is not Reddy but Deshmukh,’ she wrote on her social media page.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu