»   » శ్రేయా ఘోషల్ గ్రేట్.. మేడమ్ టాస్సాడ్ మ్యూజియంలో..

శ్రేయా ఘోషల్ గ్రేట్.. మేడమ్ టాస్సాడ్ మ్యూజియంలో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈతరం జనరేషన్‌లో అద్భుతమైన గాయనీ, గాయకుల్లో శ్రేయ ఘోషల్ ఒకరు. ప్రతిభావంతురాలైన గాయనిగా ఇప్పటికే పేరు తెచ్చుకొన్న శ్రేయా ఘోషల్‌కు మరో అరుదైన గౌరవ దక్కింది. ఆమె మైనపు విగ్రహాన్ని ఢిల్లీలోని మేడమ్ టస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిష్టించనున్నారు.

మోదీ, అమితాబ్ సరసన..

మోదీ, అమితాబ్ సరసన..

ఢిల్లీలో మేడమ్ టస్సాడ్ మ్యూజియాన్ని గత జూన్‌లో ప్రారంభించారు. ప్రపంచంలో టాస్సాడ్ మ్యూజియంలో ఇది 23వది. ఈ మ్యూజియంలో ఇప్పటికే ప్రముఖులకు స్థానం దక్కింది. తాజాగా ఈ జాబితాలో శ్రేయా ఘోషల్ చేరింది. ఆమె విగ్రహాన్ని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, ప్రధాని నరేంద్రమోదీ, పాస్ సింగర్ లేడీ గగా విగ్రహల పక్కనే ఏర్పాటు చేయనున్నారు.

థ్రిల్లింగ్‌గా ఉంది..

థ్రిల్లింగ్‌గా ఉంది..

మేడమ్ టస్సాడ్స్ మ్యూజియంలో నా విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారనే వార్తతో చాలా థ్రిల్‌గా ఫీలయ్యాను. ఎందరో గొప్ప కళాకారులు, మహానుభావుల సరసన చేరడం చాలా గర్వంగా ఉంది. అద్భుతమైన ఫీలింగ్‌కు గురవుతున్నాను అని శ్రేయా వెల్లడించింది.

ఢిల్లీలోని టస్సాడ్ మ్యూజియం

ఢిల్లీలోని టస్సాడ్ మ్యూజియం

జూన్ నుంచి మైనపు విగ్రహాల మ్యూజియంను సందర్శించేందుకు ప్రజలకు అవకాశం కల్పించారు. వివిధ రంగాలకు చెందిన 50 మంది ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. మార్చి 12 పుట్టిన రోజు జరుపుకొన్న శ్రేయా విగ్రహం కూడా త్వరలో ఈ మ్యూజియంలో ఏర్పాటుకానున్నది.

ఆకర్షణీయమైన వ్యక్తి శ్రేయా

ఆకర్షణీయమైన వ్యక్తి శ్రేయా

సంగీత ప్రపంచంలో అత్యున్నత ప్రతిభ చూపుతున్న గాయని శ్రేయా ఘోషల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలుపడానికి సంతోషిస్తున్నాం. ప్రస్తుత యువతరం కళాకారుల్లో శ్రేయా అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తి. ఆమె విగ్రహం అభిమానులను కచ్చితంగా ఆకట్టుకొంటుందనే అభిప్రాయాన్ని మ్యూజియం జీఎం అనుషల్ జైన్ తెలిపారు.

English summary
Shreya Ghoshal’s wax statue will be a highlight of Madame Tussauds’ India branch alongside statues of PM Narendra Modi and Amitabh Bachchan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu