»   »  తంతే గారెల బుట్టలో శ్రియా!

తంతే గారెల బుట్టలో శ్రియా!

Posted By:
Subscribe to Filmibeat Telugu
అపహరణ్ అనే సక్సెస్ ఫుల్ హిందీ సినిమాలో నటించిన శ్రియాకు మరో బాలీవుడ్ అవకాశం వచ్చింది. ఈ మారు అవకాశం వచ్చింది ఘనవిజయం సాధించిన ఓం శాంతి ఓం సినిమా దర్శకురాలు ఫరాఖాన్ దర్శకత్వంలో రూపొందనున్న తదుపరి చిత్రంలో. ఓం శాంతి ఓం సినిమాకు ముందు ఆమె దర్శకత్వం వహించిన మై హూ నా చిత్రం కూడా ఘనవిజయం సాధించింది. వరుసగా రెండు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఫరాఖాన్ మూడవ చిత్రంలో శ్రియాకు అవకాశం రావడం నిజంగా అదృష్టమే కదా. ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయిన ఫరాఖాన్ తన బిడ్డ ప్రసవం తరువాత ఈ మూడో సినిమా ప్రారంభం కానున్నది. షోయబ్ ఖాన్ ఈ సినిమాలో హీరోగా చేయనున్నాడు. మొత్తానికి శ్రియా శివాజీ సినిమా తరువాత ఎక్కడ తన్నినా గారెల బుట్టలో పడుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X