»   »  తెలివంటే శ్రియదే...

తెలివంటే శ్రియదే...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Shreya
ఇప్పుడు కోలివుడ్ లో హాట్ టాపిక్ శ్రియే.అంటే ఆమె నటన గురించో,లేదా కొత్త కమిట్ మెంట్ గురించో ,లేదా భాయ్ ప్రెండ్ గురించో కాదు. తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసిందని చెప్పుకోవటం ఆమెకు ఎనలేని ఖ్యాతి తెచ్చిపెడుతోంది. దాంతో వారంతా తీసుకున్న అడ్వాన్స్‌ను సినీ నటులు తిరిగి ఇచ్చేయటం ఎక్కడైనా విన్నారా! మరి ఇది నిజంగా జరిగిందట అని చెప్పుకుంటున్నారు.

తెలుగు, తమిళ చిత్రాలలో నటించి పేరు తెచ్చుకున్న నటి శ్రియ తనకు కాల్‌షీట్ల సమస్య రావటంతో తీసుకున్న అడ్వాన్స్‌ ను చెక్ గా Tamil Nadigar Sangam కు పంపిందిట. సినిమా లాంచింగా అనుకున్న సమయానికి కాకపోవటమే అసలు కారణం అని తెలుస్తోంది. అనతికాలంలో నటుడు గా మంచి పేరు తెచ్చుకున్న ఇతను రజనీ కుమార్తెను పె ళ్లి చేసుకుని ప్రముఖులలో ఒకడై పోయిన ధనుష్ సినిమా నిమిత్తం ఆమెను పొల్లాధన్ నిర్మాత Kathiresan ఈ చెక్ ఇచ్చాడుట. అయితే అలాటి వ్యక్తి సరసన నటించటమే గొప్ప అనుకుంటే ఆ అవకాశాన్ని తోసిరాజని తీసుకున్న అడ్వాన్స్‌ శ్రియ తిరిగి ఇచ్చేసిందంటే రియల్లీ గ్రేట్‌ అన్నది వారి వాదం.

అయితే అంతర్జాతీయ ప్రాజెక్టులు శ్రియను వెతుక్కుంటూ వస్తున్న ఈ దశలో ఇలాంటి తలనొప్పులు వదిలించుకోవటమే మేలని,ఏదో అడ్వాన్స్ ఉంది కదా అనుకుంటే రేపు అతను కోర్టు కు వెళ్ళితే నెగ్గటం మాట అలా ఉంచి టైమ్ వేస్టని భావించి ఈ నిర్ణయం తీసుకుందిట.అంటే తిరిగి అడ్వాన్స్ రిటన్ చేసిందన్న పేరూ వస్తుంది.తర్వాత లేనిపోని తలనొప్పులూ ఉండని స్కీమ్ వేసిన శ్రియ తెలివిని పరిశ్రమలో మెచ్చుకోనివారు లేరు.దాంతో అమ్మ శ్రియా ...అనుకుంటున్నారు కొందరు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X