»   » బాధ చూసి...నాగార్జున గన్‌తో కాల్చుకుంటానన్నారు: శ్రీయ

బాధ చూసి...నాగార్జున గన్‌తో కాల్చుకుంటానన్నారు: శ్రీయ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోయి అభిమానులను విషాదంలో మంచెత్తిన వైనం అందరినీ కలిచి వేసింది. సినిమాయే జీవితంగా బ్రతికిన ఆయన తన తుది శ్వాస కూడా సినిమా లోకేషన్ లోనే పోవాలని కోరుకున్నారంటే....సినిమా రంగం పట్ల ఆయన ఎంత అంకిత భావంతో పనిచేసారో అర్థం చేసుకోవచ్చు.

క్యాన్సర్ కారణంగా ఆపరేషన్ జరిగినా... ఆరోగ్యం సహకరించక పోయినా సినిమాలో నటించాలని తపించారు. మరికొన్ని రోజుల్లో తాను చనిపోతానని తెలిసినా ఎంతో పాజిటివ్ గా గడిపారు. ఇటీవల ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మనం' సినిమాలో అక్కినేనితో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు హీరోయిన్ శ్రీయ నెమరు వేసుకున్నారు.

Shriya about Akkineni Nageshwara Rao

ఆరోగ్యం సహకరించక పోయినా పెద్దాయన ‘మనం' సినిమాలో నటిస్తుంటే నేను చాలా కంగారు పడ్డాను. అప్పుడు ఆయన కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆసుపత్రిలో చనిపోయేకన్నా కెమెరా ముందు చనిపోతే నాకు ఆనందంగా ఉంటుంది. నా గరించి బాధ పడొద్దు. నేను చాలా హ్యాపీ మ్యాన్' అన్నారు అని శ్రీయ గుర్తు చేసుకుంది.

ఎఎన్ఆర్ పరిస్థితి చూసి నాగార్జున చాలా బాధ పడేవారు. ఓ సారి ఏదైనా గన్ ఉంటే ఇవ్వు కాల్చుకుంటాను అన్నారు. ఆయన బాధ చూసి నాకూ బాధేసేది. వృత్తి పట్ల ఎఎన్ఆర్‌కు ఉన్నమమకారం, అంకితభావం చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసేది. మనం సినిమాలో ఆయనతో గడిపిన క్షణాలు జీవితాంతం గుర్తుండి పోతాయి అని శ్రీయ చెప్పుకొచ్చారు.

English summary
Tollywood actress Shriya about Akkineni Nageshwara Rao.
Please Wait while comments are loading...