»   » వేశ్యను నమ్మి మోసపోయిన శ్రీయ!

వేశ్యను నమ్మి మోసపోయిన శ్రీయ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు సౌతిండియా సినీ పరిశ్రమలో శ్రీయ స్థానం ఏంటో అందరికీ తెలిసిందే. సౌతిండియాలోని టాప్ స్టార్ల సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. అప్పట్లో శ్రీయ కెరీర్ గ్రాఫ్ ఎంత వేగంగా పెరిగిందో....అంతే వేగంగా దిగజారి పోయింది. ఇలాంటి పరిస్థితి రావడానికి ఆమె సరైన పాత్రలు ఎంచుకోక పోవడమే అనేది పలువురి అభిప్రాయం.

బాలీవుడ్ టాప్ హీరోయిన్లు కొనసాగిస్తున్న ట్రెండును కొనసాగిస్తూ ఐటం సాంగులు చేసిన శ్రీయకు ఆ తర్వాత హీరోయిన్ అవకాశాలు తగ్గుముఖం పట్టి ఐటం సాంగుల అవకాశాలు మాత్రమే రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత అమ్మడు బి గ్రేడ్ హీరోయిన్ల లిస్టులో చేరి పోయింది.

ఆ తర్వాత రూటు మార్చి వేశ్య పాత్ర పోషించి....గుర్తింపు తెచ్చుకుందామనుకున్న శ్రీయకు ఈ విషయంలోనూ నిరాశే మిగిలింది. ఇటీవల ఆమె నటించిన 'పవిత్ర' మూవీ ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. ఇటీవల విశాఖలో బిగ్ సి మొబైల్ షోరూం ఓపెనింగు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన శ్రీయకు 'పవిత్ర' సినిమాలో చేసిన వేశ్య పాత్రపై నిరాశను వెలు బుచ్చింది.

ఈ చిత్రంలో చేసిన వేశ్య పాత్ర తనకు ఎంతో మంచి పేరు తెస్తుందని ఆశ పడ్డా. కానీ నేను ఊహించింది జరుగలేదు. కానీ అంది ఎంతో మంచి సందేశాత్మక చిత్రం అని చెప్పుకొచ్చింది శ్రీయ. ఇలా వ్యాఖ్యానించడం ద్వారా.....వేశ్య పాత్ర చేసి మోస పోయానని చెప్పకనే చెప్పింది శ్రీయ.

English summary
Shriya expressed disappointment on Pavitra movie result when she came to Visakhapatnam to launch Big C show room.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu