పవన్ కళ్యాణ్ ‘పులి’ ఐటమ్ సాంగ్ లో శ్రియ!
తెలుగులో నేరుగా చిత్రాలు చేయడం మానుకున్న చిలిపి కళ్ల శ్రియ అడపా దడపా ఐటమ్ సాంగ్స్ మాత్రం చేస్తోంది. ఆ మధ్య వెంకటేష్ పక్కన 'తులసి", దేవదాసు, మున్నా, సినిమాల్లో ఓ ఐటమ్ సాంగ్ చేసింది శ్రియ. తాజాగా, పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న 'కొమరం పులి" చిత్రంలో ఐటెమ్ సాంగ్ చేయడానికి అంగీకరించిందని సమాచారం. అయితే శ్రియ ఇంతకు మునుపే పవన్ కళ్యాణ్ తో బాలు ఎబిసిడిఇఎఫ్ జి చిత్రంలో నటించి ప్రేక్షకాదరణ పొందిన విషయం అందరికి తెలిసిందే. సింగనమల రమేష్ నిర్మాణంలో ఎస్. జె. సూర్య దర్వకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ ఐటెమ్ పాటకి శ్రియ భారీగానే డబ్బు పుచ్చుకుందట. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాల్లో కథానాయిక నటిస్తోంది. సో పవన్ కళ్యాణ్ తో శ్రియాను అలాగే తమిళ స్టార్ 'శింబు" ను ఈ సినిమాలో చూడవచ్చు అంటున్నారు దర్శకుడు ఎస్ జె సూర్య..
శ్రియ కొమరం పులి పవన్ కళ్యాణ్ ఎస్ జె సూర్య సింగనమల రమేష్ ఐటమ్ సాంగ్ shriya komaram puli pawan kalyan sj surya simbhu singanamala remesh


Click it and Unblock the Notifications