»   » తెలుగులో శ్రియ రెండవ ఇన్నింగ్స్ ప్రారంభం

తెలుగులో శ్రియ రెండవ ఇన్నింగ్స్ ప్రారంభం

Posted By:
Subscribe to Filmibeat Telugu

పులి ముందు అందాల తార శ్రియ 'చిందులు" వేయనుంది.చాల కాలం తరువాత తెలుగు సినీమా లో నటించడానికి ఈ అమ్మడు అంగీకారం తెలిపింది. 'ఇష్టం" సినిమాతో తెలుగు సినిమా రంగంలో అడుగు అడుగు పెట్టిన శ్రియ తరువాత కోంత కాలం తెరమురుగు అయ్యింది. తరువాత 'సంతోషం" సినిమాతో అదృష్టం కలిసి వచ్చింది. అప్పటి నుండి ఆమె విజయాలనే ఎక్కువగా చూసింది. బాలయ్య. వెంకటేష్, నాగార్జున, పవన్ కల్యాణ్,రవితేజ, ప్రభాస్, తరుణ్, ఉదయ్ కిరణ్ తదితురుతో నటించింది. చివరికి సంచల దర్శకుడు 'శంకర్" దర్శకత్వంలో ఏకంగా సౌంత్ ఇండియా సూపర్ స్టార్ 'రజనీకాంత్" సరసన శివాజీ సినిమాలో నటించింది. అప్పటి నుండి ఆమె స్టార్ మారి పోయింది.

తెలుగులో రవితేజతో చివరిగా భగీరధ చిత్రంలో నటించింది. తరువాత డబ్బింగ్ సినిమాలో తప్ప తెలుగులో డైరెక్ట్ సినిమా చేయలేదు. ప్రస్తుతం డాన్ శీను అనే సినిమాలో హీరోయిన్ గా ఏంపిక అయ్యింది. విచిత్రం ఏమిటంటే ఈ సినిమాలో హీరో రవితేజ కావడం. తెలుగులో రెండవ ఇన్నింగ్స్ అదే హీరోతో ప్రారంభిస్తున్న శ్రియ మరో జలక్ ఇవ్వ నుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎస్ జె సూర్య దర్శకత్వంలో నటిస్తున్న "పులి' చిత్రంలో ఐటమ్ సాంగ్ లో దర్శనం ఇవ్వనుంది. ఇక ముందు తెలుగు సినిమాలలో నటించడానికి ఈమె ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఆల్ ది బెస్ట్ 'శ్రియ"

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu