»   » అఫీషియల్: బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ హీరోయిన్ ఖరారు

అఫీషియల్: బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ హీరోయిన్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ తన 100వ సినిమాను ఎంతో ప్రతిష్టాకంగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆయన చారిత్రక నేపథ్యం ఉన్న కథను ఎంచుకున్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ చక్రవర్తి 'గౌతమిపుత్ర శాతకర్ణి' జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో చేస్తున్నారు.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. మొరాకోలో తొలి షెడ్యూల్ లో రూ. 8 కోట్ల ఖర్చుతో భారీ యుద్ధ సన్నివేశం కూడా తెరకెక్కించారు. అయితే ఇప్పటికీ ఈ సినిమాకు హీరోయిన్ ఖరారు కాలేదు. అంతకు ముందు ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపించినా వారు ఫైనల్ కాలేదు.


Shriya in 'Gautamiputra Satakarni'

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఖరారైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అఫీషియల్ గా ప్రకటించారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్ గా శ్రీయను ఎంపిక చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో ఆమె మహారాణి పాత్రలో నటించబోతోంది. ఇటీవల మొరాకోలో తొలి షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని వచ్చినఈ చిత్రం ఇప్పుడు హైదరాబాద్‌లోని చిలుకూరి బాలాజీ దేవాలయం సమీపంలో రెండో షెడ్యూల్‌ను జరుపుకొంటోంది.


క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై బిజో శ్రీనివాస్‌ సమర్పిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రెండో శతాబ్దానికి చెందిన గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

English summary
Actress Shriya Saran has reportedly been roped in to play a queen opposite Nandamuri Balakrishna in his 100th movie "Gautamiputra Satakarni," directed by Krish aka Radhakrishna Jagarlamudi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu