»   » శ్రియ..! ఇదేలా సాధ్యం??: ఎయిర్ హోస్టెస్ అవుతోంది

శ్రియ..! ఇదేలా సాధ్యం??: ఎయిర్ హోస్టెస్ అవుతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu
శ్రియ..! ఇదేలా సాధ్యం?? ఎయిర్ హోస్టెస్ అవుతోంది Shriya turns Air Hostess

శ్రియ కెరీర్ చివరకు వచ్చేసిందీ అనుకోవటం మొదలయ్యి దాదాపు ఆరేళ్ళయ్యింది. తెరకి దూరమయ్యిందీ, అవకాశాల్లేవూ అనుకుంటూనే తాను పెద్ద అవకాశాలను అందుకుంటూనే ఉంది. అదీ చిన్నాచితకా ఆఫర్లు కాదు బాలయ్య లాంటి దిగ్గజాల సరసన... ఇప్పటిదాకా శ్రియ ఇండస్ట్రీ లో నిలబడే ఉంది. పులి సినిమాలో ఐటం సాంగ్ చేసినప్పటి నుంచీ పైసా వసూల్ వరకూ చాలామంది హీరోయిన్ల కెరీర్లే ముగిసి పోయాయి కానీ శ్రియ మాత్రం తన జర్నీ తాను కొనసాగిస్తూనే ఉంది... 

ఈ ఏడాది ఇప్పటికే గౌతమి పుత్ర శాతకర్ణి.. పైసా వసూల్ చిత్రాలలో హీరోయిన్ గా కనిపించిన శ్రియ.. నక్షత్రం మూవీలో ఐటెమ్ సాంగ్ లో కూడా నర్తించింది. ఇప్పుడు కుర్ర హీరోలతో కూడా కలిసి సినిమా చేసేస్తోంది. వీర భోగ వసంత రాయలు అనే టైటిల్ పై రూపొందుతున్న మూవీలో నారా రోహిత్.. సుధీర్ బాబు నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో శ్రియ కనిపించనుంది.

Shriya Is An Air Hostess In Her Next

అయితే.. స్టోరీ ప్రకారం అసలు ఈ మూవీలో హీరో.. హీరోయిన్.. ఇలాంటి వేరియేషన్స్ ఉండవని అంటున్నారు మేకర్స్. సినిమాలో ఉండే ప్రతీ నటుల చుట్టూ అల్లుకున్న ప్లాంట్ హైలైట్ గా నిలవడనుండగా.. శ్రియ పాత్ర ఇందులో కీలకంగా కనిపించనుందని తెలుస్తోంది.

ఓ ఎయిర్ హోస్టెస్ రోల్ లో శ్రియా శరణ్ కనిపించనుంది. మూవీకి బేస్ గా నిలిచే ప్రధానమైన రోల్ ఇదే కావడంతోనే సీనియర్ యాక్ట్రెస్ ను తీసుకున్నారట. ఈ పాత్రలో నటించేందుకు.. ఎయిర్ హోస్టెస్ గా పర్ఫెక్ట్ లుక్ చూపించేందుకు.. శ్రియ చాలానే కష్టపడిందని.. స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుందని అంటున్నారు. కొత్త దర్శకుడు ఇంద్రసేన.. ఈ చిత్రంతో పరిచయం అవుతున్నాడు. సొసైటీలో అంతర్లీనంగా ఉండే చెడునే ఈ మూవీలో చూపించబోతున్నారని టాక్.

English summary
Shriya is currently busy with the shooting of the film Veerabhoga Vasantharayulu. The actress will be playing an air hostess in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu