»   »  ఆ వార్త నిజం నిజం కావాలని కోరుకుంటున్నాను...:శ్రియ

ఆ వార్త నిజం నిజం కావాలని కోరుకుంటున్నాను...:శ్రియ

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమల్‌హాసన్ హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందనున్న ఓ చిత్రంలో శ్రియ కథానాయికగా నటించనున్నారనే వార్త కోలీవుడ్‌లో ప్రచారంలో ఉంది. ఈ వార్త ఆ నోటా ఈనోటా నలిగి శ్రియ వరకు చేరింది. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ -''కమల్‌హాసన్ సరసన నటించడం అనేది నా కల. ఆ కల నెరవేరితే అంతకన్నా ఆనందం మరోటి ఉండదు. కానీ.. ఇప్పటివరకు నాకా అవకాశం రాలేదు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్త నిజం కాదు. నిజం కావాలని కోరుకుంటున్నాను"" అన్నారు.

ఈ పరిశ్రమలో 'గాడ్ ఫాదర్" లేరనే బాధ ఎప్పుడైనా కలిగిందా? అని శ్రియను అడిగితే - ''లేదు. నా మీద నాకు నమ్మకం ఎక్కువ. నేను పెరిగిన వాతావరణానికి, సినిమాలకు అసలే మాత్రం సంబంధం లేదు. అందుకని సినిమాల్లోకి వచ్చినప్పుడు భయం భయంగా అనిపించింది. ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉండి ఉంటే భయం అనిపించేది కాదు. సినిమా రంగం గురించి అవగాహన ఉండేది. అవకాశాలు సులువుగా వచ్చి ఉండేవి. బ్యాగ్రౌండ్ అనేది అంతవరకే ఉపయోగపడుతుంది.

అంతే తప్ప ఇక్కడ నిలదొక్కుకోవడానికి మాత్రం పనికి రాదు. ప్రతిభ ఉంటేనే తదుపరి అవకాశాలు వస్తాయి. నాకిక్కడ గాడ్ ఫాదర్ లేకపోయినా పోటీ తట్టుకుని మంచి స్థానానికి చేరుకోగలిగానంటే నా ప్రతిభే కారణం. అలాగే నాకు మంచి అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తున్న దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది"" అన్నారు.

English summary
The latest buzz doing the round is that she has been approched for the next magnum opus by 
 
 Ulaganayagan Kamal Hassan. ”I went over to cloud nine when they approached me to act opposite 
 
 Kamal sir in MarmayogiHowever, talks are still on and nothing has been finalized yet.’ Shriya Saran 
 
 said when quizzed about this.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu