»   » సినిమాల్లోకి వచ్చి పోగొట్టుకున్నా: శ్రియ

సినిమాల్లోకి వచ్చి పోగొట్టుకున్నా: శ్రియ

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రియకు ఇప్పుడు తన పరిస్ధితి చూసే తనే మండిపడుతోంది. తాను సినిమాల్లోకి వచ్చి సాధించిన దానికన్నా ఎక్కువ విలవైంది పోగొట్టుకున్నా అంటోంది. అది మరేదో కాదు మనశ్శాంతి అని చెప్తోంది. అందేంటి మంచి కెరీర్, స్టార్ డమ్ పెట్టుకుని అలా అంటున్నారేంటి అంటే... ప్రస్తుతం వెలుగుతున్న ఏ హీరోయిన్ చూడనంత స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేశాను నేను. నెలలో దాదాపు పదిహేను రోజులు కేవలం ఫ్లైట్స్ లోనే గడిపేసేదాన్ని. అంత బిజీ లైఫ్ నాది. కానీ ఇప్పుడు కాస్త సినిమాలు తగ్గేసరికి ఎవరికి తోచింది వాళ్లు రాసేస్తున్నారు. ఎవరికి ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తున్నారు. అందుకే చాలా బాధ అనిపిస్తోంది అని ఆవేదనగా అంది.

అలాగే నేను బిజీగా ఉన్నప్పుడే నాకున్న ఇమేజ్‌ని క్యాష్ చేసుకోలేని అసమర్థత నాది. కానీ నా పరిస్థితికి భిన్నంగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. డబ్బులు వెనకేసుకోవడంలో నా తర్వాతే ఎవరైనా అని, ఇప్పటికే నేను కోట్లకు కోట్లు పోగేశానని ఏవేవో రాసేస్తున్నారు. నేను పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్‌తో పుట్టాను. నా తోటి హీరోయిన్స్ లో ఫలానా వాళ్లకంటే ఎక్కువ నేను సంపాదించాను అని రుజువు చేస్తే నేను సంపాదించిందంతా ఇచ్చేయడానికి రెడీ అని ఆమె మీడియాకు సవాలు విసిరారు శ్రియ. నటిగా మంచి పేరును, ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాను. నాకు సంతృప్తినిచ్చే అంశం ఇదొక్కటే అని చెప్పారు శ్రియ.

English summary
Actress Shriya is said to be angry on Media for publishing a fake news about her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu