'త్రిషం' కు స్వర్గం

విడిపోయిన కరీనా కపూర్, షాహిద్ కపూర్ జంటగా చేసిన బాలీవుడ్ సూపర్ హిట్ 'జబ్ వుయ్ మెట్' సినిమాని తమిళంలో మోజర్ బేర్ కంపెనీ వారు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాన్లో ధనుష్ ని హీరోగా...త్రిషను హీరోయిన్ గా తీసుకున్నారు. రేపో...మాపో షూటింగ్ స్టార్ట్ అవుతుందనుకున్న దశలో త్రిషను మారుస్తూ...శ్రియను తీసుకుంటూ డెషిషన్ తీసుకున్నారు. త్రిష పొగురుమోతు తనంతో బయిట ప్రొడ్యూసర్స్ కి ట్విస్ట్ ఇచ్చినట్లే మోజర్ బేర్ వారికి ఇవ్వచూసిందనీ అందుకనే వారు మొహమాటం అనేది లేకుండా త్రిషను తీసేసి శ్రియను తీసుకున్నారని చెప్పుకుంటున్నారు. అందులోనూ గతంలో శ్రియ,ధనుష్ కాంబినేషన్ లో Thiruvilayadal Arambam అనే సూపర్ హిట్ వచ్చింది. అలా ఊహించని విధంగా త్రిష కెరీర్ లో ఈ భారీ మార్పు చోటు చేసుకుంది. ఇలా సీన్ రివర్స్ అవటంతో త్రిష డైలమాలో పడిందట. అందులోనూ మోజర్ బేర్ వారి రాబోయే భారీ బడ్జెట్ చిత్రం Abhiyum Naanum లోనూ ఆమే హీరోయిన్. ఇప్పుడీ సంఘటన జరుగంతో దాంట్లో నయినా ఆమె ఉంటుందా అని ఆమెకి అనుమానం వస్తోందిట. దాంతో చేతికందిన స్వర్గం చేజారుతుందా అని ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతోందిట.


Click it and Unblock the Notifications











