»   » రాజకుమారిగా కత్తితిప్పుతూ శ్రియా

రాజకుమారిగా కత్తితిప్పుతూ శ్రియా

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: దాదాపు కెరీర్ చివరి దశలో ఉన్న శ్రియ ఇప్పుడు కన్నడంలో ప్రయత్నం చేస్తోంది. ఇండియా క్లాసిక్‌ ఆర్ట్స్‌ పతాకంపై దర్శకురాలు రూపా అయ్యర్‌ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చంద్ర సినిమా విడుదల కానుంది. ఆమే ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటల్ని సమకూర్చారు. ప్రేమ్‌ (నెనపిరలి సినిమా ఫేం), శ్రియా శరణ్‌ జంటగా నటించారు.

ఈ సినిమాను కన్నడతో పాటు తమిళంలో కూడా విడుదల చేస్తున్నారు. రాజుల కాలం నాటి కథతో సినిమా రూపొందింది. ఇందులో శ్రియాశరణ్‌ రాజకుమారి పాత్రను పోషించింది. ప్రేమ్‌డి మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడి పాత్ర. వీరిద్దరి నడుమ ప్రేమ... ఎదురయ్యే సంఘటనలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రూపొందినట్లు దర్శకురాలు వెల్లడించారు.

సినిమాలో ఆమె రాజకుమారిగా 'మహారాణి అమ్మన్ మణి చంద్రావతి' పాత్రలో నటిస్తోంది. వయసు పెరుగుతున్నా కూడా నవనవలాడే సౌందర్యాన్ని కోల్పోని శ్రియ ఈచిత్రంలో మరింత గ్లామర‌స్‌గా కనిపించనుంది. ఒక యువరాణిగా పుట్టి పెరిగిన యువతి సాధారణ జీవితాన్ని గడపడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అన్నదే 'చంద్ర' చిత్ర కథాంశం. ఈ చిత్రంలో శ్రియ కలరి ఫైట్స్ చేస్తోంది.

శ్రియ మాట్లాడుతూ.. ... 'చంద్ర' సినిమాకోసం ఒక అందమైన దేవాలయంలో చిత్రీకరించిన కలరి ఫైట్ సన్నివేషాల చిత్రీకరణలో పాల్గొన్నాను. ఈ ఫైట్ లో వాడిన కత్తులు మరియు కాస్ట్యూమ్స్ చాలా బరువుగా ఉండడం వల్ల ఇప్పటికీ కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి. నాకు మరియు ప్రేమ్(కో స్టార్)కి మధ్య జరిగే ఈ యాక్షన్ సన్నివేశాలను రూప అయ్యర్ (దర్శకురాలు) ఎంతో బాగా చిత్రీకరించారని' తన ట్విట్టర్లో పేర్కొంది.

చంద్ర సినిమా కోసం శ్రియా శరణ్‌ కేరళ యుద్ధవిద్య కలరిపయట్టులో శిక్షణ కూడా తీసుకుంది.తమిళనటుడు వివేక్‌, శ్రీనాథ్‌, గణేష్‌ వెంకటరామ, ధర్మ, సాధుకోకిలా, ఎం.ఎన్‌.లక్ష్మీదేవి, దీపా అయ్యర్‌, సానియా ప్రధాన తారాగణం. ఫొటోగ్రఫీ- పి.కె.హెచ్‌.దాస్‌, సంగీతం- గౌతమ్‌ శ్రీవత్సవ.

English summary
Shriya plays a princess who performs her duties as a member of the royal family and that of a 'regular' girl. Stuck between the modern world and age-old traditions, the princess tries to balance her lifestyles to find her ideal man.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu