»   » శ్రియ పెళ్ళి ఫొటో... తనే పోస్ట్ చేసింది

శ్రియ పెళ్ళి ఫొటో... తనే పోస్ట్ చేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

దక్షిణాది భాషల్లో అగ్ర హీరోల సరసన నటించిన శ్రియకు ప్రస్తుతం అవకాశాలు అంతంతమాత్రంగానే లభిస్తున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ ప్రతిష్టాత్మక చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'తో పాటు తమిళంలో రవిచంద్రన్ దర్శకత్వంలో శింబు హీరోగా నటిస్తున్న భారీ చిత్రం 'ఏఏఏ'లోనూ కీలక పాత్ర పోషిస్తోంది.

ఇప్పుడు తాజాగా తాను పెళ్ళి పీటలెక్కానని శ్రేయ ఓ ఫోటోని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అయితే అసలు విషయంపై ఆరా తీస్తే ఈ ఫోటో శింబుతో కలిసి చేస్తోన్న 'ఎఎఎ' సినిమాకు సంబంధించినదని తెలిసింది. చిత్ర షూటింగ్‌లో భాగంగా శ్రేయ ఇలా తయారయ్యారట.

 Shriya Saran in bridal dress

ఎఎఎ సినిమాలో పెళ్ళి కూతురు.. 2016లో 1980 అని కొన్ని ఫోటోస్ తో పాటు కామెంట్ పెట్టింది శ్రేయ. సినిమా కథ ప్రకారం... పెళ్లికూతురు 1980లనాటి కాలానికి చెందినదై ఉండాలి. అంటే.. మనం సినిమాలో శ్రియ ఎలాగైతే పాత గెటప్ లో కనిపించిందో... తాజా చిత్రంలో కూడా అలాంటి గెటప్పే అన్నమాట. అదే విషయాన్ని శ్రియ కూడా ప్రస్తావించింది. 2016లో... 1980ను చూడండి అంటూ ఈ ఫొటో పెట్టింది.

సెల్ఫీ అనే పాత్రను శ్రేయ చేస్తుండగా, ఈ చిత్రాన్ని అథిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్నారు. శింబు ఈ చిత్రంలో మూడు పాత్రలు చేయనున్నట్టు టాక్. మేజర్ షూటింగ్ మైసూర్, కేరళలో జరగనుందని తెలుస్తోంది. శ్రేయ గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలో బాలయ్య సరసన కథానాయికగా నటించనున్న సంగతి తెలిసిందే.

 Shriya Saran in bridal dress

ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్న శింబు మూడు పాత్రల్లో...మూడు వేరు వేరు వయసుల్లో కనిపిస్తాడట. ఈ చిత్రంలో హీరోయిన్లు ఎవరన్న విషయాన్ని సీక్రేట్ గానే ఉంచినా నడివయసులో ఉండే ఫాదర్ క్యారెక్టర్ సరసన నటించటానికి శ్రియ ని ఒప్పించారట. ఈ పాత్రకు జోడీగా మొదట చెన్నై చిన్నది త్రిషను సంప్రదించగా సింపుల్ గా నో చెప్పేసిందట. ఆ పాత్రలోనే శ్రెయ మనకి కనిపించ్వ్హనుంది. త్వరలో ప్రారంభం కానున్న ఈ అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రానికి సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా ట్యూన్లందించే పనిలో ఉన్నాడట... కనీసం ఈ సినిమాలతో అయినా శ్రియ ఫామ్ లోకి వస్తుందా చూడాలి.

English summary
Shriya Saran, the beautiful Diva who stole the hearts of youngsters in Millions from the past two decades is created a storm by tweeting her marriage pics today. This was on the sets of her new Tamil movie in Simbu’s combination. The film is titled “AAA” which is the short form for “Anbanavan Asaradhavan Adangadhavan”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu