»   » శ్రీయా సరన్ పెళ్లి.. వరుడు ఎవరంటే?.. నా జీవితాన్ని అమ్మకానికి పెట్టనన్న బ్యూటీ

శ్రీయా సరన్ పెళ్లి.. వరుడు ఎవరంటే?.. నా జీవితాన్ని అమ్మకానికి పెట్టనన్న బ్యూటీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందాల తార శ్రీయా సరన్ త్వరలోనే పెళ్లికూతురు కాబోతున్నది. గత కొద్దికాలంగా రష్యా క్రీడాకారుడు, ప్రముఖ వ్యాపారవేత్త అండ్రీ కోశ్చేవ్‌ను వివాహం చేసుకొనున్నారు. గత రెండు దశాబ్దాల సినీ కెరీర్‌ అనంతరం దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టున్నారు. శ్రీయా పెళ్లిపై మీడియాలో వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ వివాహ వార్తను ఆమె సన్నిహితులు ధ్రువీకరించారు.

 ఉదయ్‌పూర్‌లో పెళ్లి

ఉదయ్‌పూర్‌లో పెళ్లి

శ్రీయా సరన్, అండ్రీ కొశ్చెవ్‌ వివాహం మార్చిలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగున్నది. మార్చి 17, 18, 19 తేదీలలో ఘనంగా పెళ్లి వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

 శ్రీయా సరన్ రుసరుస

శ్రీయా సరన్ రుసరుస

ఇటీవల రష్యా క్రీడాకారుడిని పెళ్లి చేసుకొంటున్నట్టు వచ్చిన వార్తలపై శ్రీయా మండిపడిన విషయం తెలిసిందే. నా జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన కథలు ఉంటాయి. అవన్నీ మీకు చెప్పాలా? నా ప్రొఫెషనల్ జీవితం గురించి అడగండి. నా వ్యక్తిగత జీవితాన్ని అమ్మకం పెట్టను. నేను నటిని. నా సినిమాల గురించి నన్ను అడగండి అంటూ శ్రీయా రుసరుసలాడింది.

స్వయంగా ఫోన్‌లో ఆహ్వానం

స్వయంగా ఫోన్‌లో ఆహ్వానం

ఉదయ్‌పూర్‌లో పెళ్లి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. తన స్నేహితులకు, సహచర నటులకు శ్రీయా స్వయంగా ఫోన్ చేసి పెళ్లికి ఆహ్వానిస్తున్నది అని శ్రీయా సన్నిహితురాలు వెల్లడించింది.

హోళీ పండుగ థీమ్‌లో

హోళీ పండుగ థీమ్‌లో

శ్రీయా, కొశ్చెవ్ వివాహం హిందూ సంప్రదాయ పద్ధతి ప్రకారం నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. హోళీ పండుగ థీమ్‌లో తన పెళ్లిని, సంగీత్, మెహందీ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అని సన్నిహితులు పేర్కొన్నారు.

 ప్రకాశ్ రాజ్ దర్శకత్వంలో

ప్రకాశ్ రాజ్ దర్శకత్వంలో

తెలుగులో శ్రీయా నటించిన గాయత్రి సినిమా ఇటీవలే విడుదలై సక్సెస్ సాధించింది. ఇక హిందీలో నానాపాటేకర్, అలీ ఫజల్, తాప్సీ పొన్ను‌తో కలిసి తడ్కా అనే చిత్రంలో నటిస్తున్నది. తమిళంలో ఘన విజయం సాధించిన ఉన్ సమయాల్ అరవిల్ అనే చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతున్నది. ఈ చిత్రానికి విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

English summary
South Indian star Shriya Saran is all set to tie the knot with her Russian boyfriend Andrei Koscheev in March. The three-day-long ceremony is slated to take place in Udaipur. Reports suggest that, Actress Shriya Saran to get married to Russian sportsman, businessman Andrei Koscheev over a three-day ceremony in Udaipur on March 17, 18 & 19.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu