»   » అసెస్టెంట్ డైరక్టర్ గా ప్రతీ ఒక్కరూ పని చేయక్కర్లేదు...శ్రియ

అసెస్టెంట్ డైరక్టర్ గా ప్రతీ ఒక్కరూ పని చేయక్కర్లేదు...శ్రియ

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకత్వం చేయాలనుకునే ఆలోచన ఉన్నవారికి మంచి స్క్రిప్టు చేతిలో ఉండి, సినిమా మేకింగ్ పట్ల అవగాహన ఉంటే చాలు. ఎవరి ద్గరైనా అసిస్టెంట్ డైరక్టర్ గా తప్పక పనిచేయాలనే రూల్ ఏమీ లేదు. మణిరత్నం, మధుర్‌భండార్కర్ వంటి దర్శకులు ఎవరి దగ్గరా పనిచేయలేదు. వారిదైన శైలిలో ప్రణాళికతోనే విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. వారిని ఆదర్శంగా తీసుకుంటే విజయపరంపర సొంతమవుతుంది అంటూ చెప్పుకొచ్చింది శ్రేయ. అలాగే..హిట్..ప్లాప్ అనేవి ఈ రంగంలో చాలా కీలకం. బాక్సాఫీసును షేక్ చేసే హిట్టు వచ్చినప్పుడు అందరూ పట్టించుకుంటారు. అదే చిన్న ఫ్లాప్ వచ్చినా మనల్ని పట్టించుకునే వారే కరవవుతారు. అందుకే గెలుపు ఓటములను ఒకేలా చూసే పరిపక్వత ముఖ్యం. వెండితెర గురించి కలలు కనేవారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే అందామె.

మొవ్న పవన్ పులి లోనూ, ఆ తర్వాత డాన్ శీను లో కనిపించిన శ్రియ తాజాగా దీపా మెహతా దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించేందుకు అంగీకరించింది. ఆ సినిమాకి సల్మాన్‌ రష్దీ రచించిన 'మిడ్‌నైట్‌ చిల్డ్రన్స్‌' నవల ఆధారం. ఇక శ్రియ త్వరలో 'పానీ' అనే చిత్రంలో నటించబోతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ డైరక్ట్ చేసే ఈ చిత్రం ఓ సైన్స్ ఫిక్షన్. నీటి కోసం ధనిక, పేద వర్గాల మధ్య జరిగే పోరాటాన్ని ప్రధానాంశంగా చేసుకుని ఈ చిత్రాన్ని తీస్తున్నారు. హృతిక్‌ రోషన్‌ హీరోగా చేస్తున్న ఈ చిత్రానికి 'స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌' దర్శకుడు డానీ బోయెల్‌ నిర్మాత. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించనున్నారు.

English summary
South Sexy Shriya got chance to act under Bollywood ace director, National Award Winner Shekhar Kapoor. In this film she will romance with Bollywood hunk Hrithik Roshan. Film titled 'Paani'. It is a Science fiction film, fight for water between rich and poor will be shown in this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu