»   » బాహుబలిని మించి పోతుందా..? 350 కోట్ల బడ్జెట్, శృతీ హసన్ కత్తిసాము

బాహుబలిని మించి పోతుందా..? 350 కోట్ల బడ్జెట్, శృతీ హసన్ కత్తిసాము

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రుతీహాసన్ ఇప్పుడు కత్తితిప్పుతోంది. దాదాపు రూ.150కోట్ల వ్యయంతో సుందర్‌.సి. తెరకెక్కించనున్న త్రిభాషా చిత్రం 'సంఘమిత్ర'లో శ్రుతీహాసన్ నటించనున్న సంగతి తెలిసిందే. టాలివుడ్, బాలివుడ్ ఏ చిత్రపరిశ్రమలో అయినా సరే చరిత్ర ప్రాధాన్యమున్న సినిమాలకు ఇప్పుడున్న డిమాండ్ అంత ఇంతా కాదు.

బాహుబలి

బాహుబలి

కొన్నాళ్ళ క్రితం వీర్, ద్రోణ లాంటి దారుణమైన దెబ్బలతో అలాంటి సినిమాలు తీయటానికి భయపడ్దారు బాలీవుడ్ దర్శక నిర్మాతలు , కేవలం సంజయ్ లీలా బన్సాలి మాత్రమే అలాంటి సాహసం చేస్తూ వచ్చాడు. అయితే "బాహుబలి" మళ్ళీ అటువంటి కథల మీద మళ్ళీ నమ్మకం పెంచింది.

చారిత్రాత్మక చిత్రమంటే చాలు

చారిత్రాత్మక చిత్రమంటే చాలు

తమిళనాట విజయ్ హీరో గా వచ్చిన "పులి" వేసిన దెబ్బకి కళ్ళు బైర్లు కమ్మినా మిగతా దర్శకులూ, నిర్మాతలకి మాత్రం చారిత్రాత్మక కథల మీద ఇంకా మోజు పెరుగుతూనే వస్తోంది... చోటా మోటా నటులే కాదు బడా బడా స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా ఇప్పుడు చారిత్రాత్మక చిత్రమంటే చాలు సై అంటున్నారు.

కత్తి ఫైటింగులు

కత్తి ఫైటింగులు

క్రేజీ హీరోయిన్ శ్రుతీహసన్ కూడా ఇప్పుడు సంఘమిత్రలో చేయబోతున్న పాత్ర "కత్తి ఫైటింగులు" ఉన్నదే.... కోలీవుడ్‌ దర్శకుడు, ఖుష్భూ భర్త సుందర్‌.సి భారీ బడ్జెట్‌తో 'సంఘమిత్ర' అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పీరియాడిక్‌ బేస్డ్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోలుగా ఆర్య, జయం రవిలు కనిపించనున్నారు.

బాహుబలి రేంజిలో

బాహుబలి రేంజిలో

ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతుండగా, డైరక్టర్‌ గ్రాఫిక్‌ పనుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. బాహుబలి రేంజిలో ఈ చిత్రం భారీ ఎత్తున గ్రాఫిక్స్ తో నిండి ఉండబోతోందని తెలుస్తోంది. 350 కోట్లు బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతోందని చెప్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ బాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సుందర్‌.సీ దర్శకత్వం వహించనున్నారు.

శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌

శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌

శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ తన నూరవ చిత్రంగా రూపొందనున్న ఇందులో ఇంతకు ముందు ఇళయదళపతి విజయ్, టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు వంటి నటులతో నిర్మించాలని భావించినా వారి కాల్‌షీట్స్‌ సర్దుబాటు కాకపోవడంతో యువ స్టార్స్‌ జయంరవి, ఆర్యలను కథానాయకులుగా ఎంపిక చేశారు.

జయం రవి, ఆర్య

జయం రవి, ఆర్య

యువరాణిగా శ్రుతి నటిస్తున్న ఈ సినిమాలో జయం రవి, ఆర్య కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా కోసం శ్రుతిహాసన్ తాజాగా కత్తి సాము నేర్చుకుంటోంది. శ్రుతి సన్నిహితుల సమాచారం మేరకు ‘‘సంఘమిత్ర కోసం శ్రుతి అహర్నిశలు శ్రమిస్తోంది. వీరవనితగా కనిపించడానికి అన్నివిధాలా తనవంతు కృషి చేస్తోంది.

లండన్‌కు చెందిన యాక్షన్ కొరియోగ్రాఫర్‌

లండన్‌కు చెందిన యాక్షన్ కొరియోగ్రాఫర్‌

అందులో భాగంగానే లండన్‌కు చెందిన యాక్షన్ కొరియోగ్రాఫర్‌ దగ్గర కత్తిసాము అభ్యసిస్తోంది. కత్తిసాములో ప్రాథమిక అంశాలు ఇప్పటికే నేర్చుకుంది. ప్రస్తుతం మైండ్‌ మేపింగ్‌ టెక్నిక్స్‌ను ఔపాసన పడుతోంది. తెరమీద పర్ఫెక్ట్‌గా కనిపించడానికి అసలైన కత్తిసామువీరుల వద్ద టెక్నిక్స్‌ను తెలుసుకుంటోంది'' అని చెప్పారు.

English summary
Sruthi acts as a princess in "Sanghamitra" and she has to do sword fighting and wrestling. Sruthi is getting training in sword fighting from a professional trainer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu