»   » లెక్చరర్ గా శృతి హాసన్, స్టూడెంట్ గా నాగచైతన్య

లెక్చరర్ గా శృతి హాసన్, స్టూడెంట్ గా నాగచైతన్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: హీరోయిన్ శృతి హాసన్, త్వరలో లెక్చరర్ గా కనిపించనుంది. మళయాళ సూపర్ హిట్ "ప్రేమమ్" తెలుగు రీమేక్ లో ఈమె లెక్చరర్ పాత్రను పోషించనుంది. 'మజ్ను' టైటిల్ దాదాపు ఖరారైన ఈ చిత్రంలో శ్రుతి పాత్ర హైలెట్ కానుంది.

'సాయి పల్లవి' అనే క్యారెక్టర్‌కు స్పెషల్ మేకోవర్ ప్లాన్ చేస్తోందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. శ్రీమంతుడు తరువాత తెలుగులో చేస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్‌కు జోడిగా అక్కినేని నాగ చైతన్య లీడ్ రోల్ లో నటిస్తున్నాడు.

Shruthi Hassan to play lecturer

నాగ చైతన్య స్టూడెంట్ గా శ్రుతి లెక్చరర్ గా కన్పించనున్నారు. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించనున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ మొదటివారంలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. అటు మలయాళ ' ప్రేమమ్'లో సెకండ్ హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ తెలుగులో కూడా యాక్ట్ చేస్తోంది.

రేసుగుర్రం, శ్రీమంతుడు చిత్రాలు భారీ విజయంతో జోరుమీదున్న భామ శ్రుతి హాసన్. దీంతో మరో తెలుగు సినిమా పాత్ర కోసం అపుడే కసరత్తు మొదలుపెట్టిందిట. శ్రీమంతుడు సినిమా తరువాత తెలుగులో చేస్తున్న ఈ మలయాళ రీమేక్ లో శ్రుతి... లెక్చరర్ పాత్ర పర్ ఫెక్షన్ కోసం తెగ తాపత్రయపడుతోందని అందుకోసం ఆ సినిమాను ఒకటికి పది సార్లు చూస్తోందిట. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకధాటిగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు మలయాళంలో సూపర్ హిట్ అయిన 'ప్రేమమ్' తెలుగు రీమేక్‌కి సైన్ చేసింది.

English summary
Actress Shruti Haasan will be reprising Sai Pallavi's role of a lecturer in "Premam"remake. She'll be undergoing special makeover for her role. She has already started prepping for her role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu