»   » అటు కోర్టు కేసు: ఇటు ఫెంటాస్టిక్ అంటూ శృతి హాసన్ ట్వీట్

అటు కోర్టు కేసు: ఇటు ఫెంటాస్టిక్ అంటూ శృతి హాసన్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ శృతి హాసన్ ఏ కొత్త సినిమా ఒప్పుకోకూడదని, క్రిమినల్ ఇన్విస్టిగేషన్ చెయ్యమని చెన్నై కోర్టు ఆర్డర్ వేసిన సంగతి తెలిసిందే. పిక్చర్ హౌస్ మీడియా లిమిటెడ్ (హైదరబాద్,చెన్నై) వారు ఆమెపై సివిల్ మరియు, క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరుపమని కోర్టు కెక్కడంతో కోర్టు పై విధంగా ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఇంత జరుగుతున్నా....శృతి హాసన్ మాత్రం ఏమాత్రం టెన్షన్ పడటం లేదు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ మూవీ ‘యారా'లో నటిస్తోంది. ఈ షూటింగ్ పూణెలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆమె ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ పూణెలో షూటింగ్ ఫెంటాస్టిక్ గా జరుగుతోంది, లైఫ్ లో బెస్ట్ టైమ్ ఇదే అంటూ ట్వీట్ చేసింది.

ఓ వైపు కోర్టు కేసు నడుస్తున్న నేపథ్యంలో శృతి హాసన్ ఇలాంటి ట్వీట్స్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఈ కేసు వల్ల తానేమీ టెన్షన్ పడటం లేదని సంకేతాలు ఇచ్చేందుకు ఆమె ఇలా ట్వీట్ చేసిందని అనుకుంటున్నారంతా. అయినా సినిమా రంగంలో ఇలాంటి కేసులు సర్వసాధారణమే.

Shruthi Hassan responds over Court Case

కేసు ఎందుకు పెట్టారు...?
ఈ వివాదం నాగార్జున, కార్తి చిత్రం గురించి వివాదం అని తెలుస్తోంది. ఈ బైలింగ్వుల్ చిత్రం నుంచి ఆమె డేట్స్ ఎడ్జెస్ట్ కాక తప్పుకోవటంతో నిర్మాతలు కోర్టుకు వెళ్లారని సమాచారం. ఆమె షూటింగ్ కు రావాల్సిన సమయంలో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ సమయంలో తాను షూటింగ్ కు హాజరు కాలేకపోతున్నానని ఈమెయిల్ ఇవ్వటంతో నిర్మాతలు కోర్టుకెక్కారు.

శృతి హాసన్ ఉన్నట్టుండి అర్ధాంతరంగా తప్పుకోడాన్ని అనైతిక చర్యగా, అన్ ప్రొఫిషనల్ వ్యవహారంగా పరిగణించినట్లు ఆ సంస్ద ప్రకటించింది. ఆమె షూటింగుకు రాక పోవడం వల్ల తమకు ఫైనాన్సియల్ లాస్, రిప్యుటేషన్ లాస్ అయిందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేసారు. కోట్లాదిరూపాయల డబ్బు, రిప్యుటేషన్ పోవటంతో పాటు తమ సమయం కూడా చాలా వృధా అయిందని అంటున్నారు. దీనివలన బిజిగా ఉన్న మిగతా ఆర్టిస్టుల షెడ్యుల్ దెబ్బ తిని లాస్ చాలా ఉంటుందని చెప్తున్నారు.

శృతి హాసన్ విషయమై పిక్చర్ హౌస్ మీడియా వారు చాలా సీరియస్ గా ఉన్నారు. వారు కోర్టునిఆమెపై సివిల్ మరియు క్రిమినల్ పొసీడింగ్స్ జరపమని కోరారు. దాంతో కోర్టు వారు...ఆమె ఏ కొత్త చిత్రం సైన్ చేయకూడదని, పోలీస్ లు ఈ కేసుపై ఇన్విస్టిగేషన్ చెయ్యాలని కోరారు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళం, తెలుగులో నిర్మితమవుతున్న చిత్రంలో నాగార్జున, కార్తి కలిసి నటిస్తున్నారు. ఇందులో కార్తికి జంటగా నటించడానికి శృతిహాసన్‌ను ఎంపిక చేశారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌, చెన్నైలోనూ జరిగింది. ఇప్పటికే తమిళంలో విజయ్‌, తెలుగులో మహేష్‌ బాబుతో కలిసి నటిస్తున్న ఆమె హిందీలో గబ్బర్‌' సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటున్నారు. వీటితో బిజీగా ఉండటంతో కాల్షీట్ల సమస్య తలెత్తిందని, కార్తిక్‌ చిత్రంలో కొనసాగాలనుకున్నా కాల్షీట్ల సమస్యతో మిగిలి చిత్రాల్లో నటించడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. ఆ చిత్రం నుంచి శృతిహాసన్‌ తప్పుకున్నారని, కార్తి సరసన హీరోయిన్‌ను ఎంపిక చేయడంలో చిత్ర బృందం నిమగ్నమైందని చెప్పారు. ఈ లోగా కోర్టు నుంచి ఈ విధమైన ఆర్డర్ వచ్చింది.

English summary
Picturehouse Media, a leading media and entertainment house, has initiated legal proceedings against actress Shruti Haasan, who pulled out of its yet-untitled Tamil-Telugu bilingual project citing the issue of dates.
Please Wait while comments are loading...