»   »  శ్రుతిహాసన్‌కి అనారోగ్యం...అపోలో లో ఆపరేషన్

శ్రుతిహాసన్‌కి అనారోగ్యం...అపోలో లో ఆపరేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Shruti Haasan
హైదరాబాద్‌: శ్రుతిహాసన్‌ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న శ్రుతిహాసన్‌ తిరిగి వెళ్తుండగా కడుపునొప్పితో బాధపడ్డారు. దీంతో ఆమెను అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. కడుపునొప్పికి కారణం అపెండిసైటిస్‌గా వైద్యులు నిర్థారించారు. వెంటనే ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు.

శ్రుతిహాసన్‌, అమీ జాక్సన్‌ హీరోయిన్స్ గా చేసిన 'ఎవడు' సినిమాని ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకత్వం వహించారు. దిల్‌ రాజు నిర్మాత. సినిమా ప్రత్యేక ప్రచార చిత్రాన్ని ఈ నెల 3న విడుదల చేసారు. కొత్త టీజర్ తో మళ్ళీ క్రేజ్ వచ్చింది.

''బతికితే ఆశలు... పోతే ప్రాణాలు అనుకునే తత్వం ఉన్న యువకుడి కథ ఇది. రామ్‌చరణ్‌ ...నాయకుడి పాత్రలో మరోసారి ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. అల్లు అర్జున్‌, కాజల్‌ ప్రత్యేక పాత్రలు సినిమాకి అదనపు ఆకర్షణ. దేవిశ్రీప్రసాద్‌ అందించిన పాటలకు మంచి స్పందన వచ్చింది'' అన్నారు నిర్మాత. కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, కళ: ఆనంద్‌సాయి, సహనిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌. నూతన సంవత్సరం సందర్భంగా బీజియంతో కూడిన కొత్త టీజర్‌ని మంగళవారం ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.

English summary
Shruti Haasan was admitted in Apollo Hospitals, Hyderabad few hours back. The main reason for this was cited to be the 24 hours stomach ache [appendicitis] and she is undergoing a minor operation now. As per the reports, there’s nothing much to worry in this case and everything will be back to normal
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu