»   » కమల్ పంక్షన్ ...శృతిహాసన్, గౌతమి గెస్ట్ లుగా ..(ఫొటోలు)

కమల్ పంక్షన్ ...శృతిహాసన్, గౌతమి గెస్ట్ లుగా ..(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :కమల్‌ హాసన్‌ హీరోగా నటించిన చిత్రం 'ఉత్తమ విలన్‌'. ఆండ్రియా, పూజా కుమార్‌ హీరోయిన్స్. రమేష్‌ అరవింద్‌ దర్శకుడు. జిబ్రాన్‌ సంగీతం అందించారు. సి.కల్యాణ్‌ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులతో పాటు కమల్ భార్య గౌతమి, కూతురు శృతిహాసన్ హాజరయ్యారు. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సమర్పణలో తిరుపతి బ్రదర్స్‌ ఫిల్మ్‌ మీడియా ప్రై.లి., రాజ్‌కమల్‌ పిల్మ్‌ ఇంటర్నేషనల్‌ పతాకాలపై రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న విభిన్న చిత్రం ‘ఉత్తమ విలన్‌'. ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సి.కళ్యాణ్‌ అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.


''ప్రపంచ కళాకారుల కులమంతా గర్వపడేలా చేసిన వ్యక్తి కమల్‌ హాసన్‌. ఆయనకు తెలియని విద్య లేదు. కమల్‌ ఏం చేసినా అద్భుతంగానే ఉంటుంద''న్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హైదరాబాద్‌లో జరిగిన 'ఉత్తమ విలన్‌' పాటల విడుదల వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఆడియో విడుదల విశేషాలు..ఫొటోలతో...


ట్రైలర్ విడుదల

ట్రైలర్ విడుదల

ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ నటి శృతిహాసన్ విడుదల చేసారు.


పాటలు విడుదల

పాటలు విడుదల

పాటలను నిర్మాత సి.కళ్యాణ్ విడుదల చేశారు.ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ...

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ...

''నేను, కమల్‌ వేర్వేరు కాదు. మేమిద్దరం ఒక్కటే అన్నది నా భావన. నన్ను అన్నయ్య అని పిలిచే అతి కొద్దిమంది ఆత్మీయుల్లో కమల్‌ ఒకడు. తను మా తమ్ముడు అని చెప్పుకోవడానికి గర్వపడతాను. కమల్‌ నటించిన 120 చిత్రాలకు నేను డబ్బింగ్‌ చెప్పాను. తనది ప్రత్యేకమైన గాత్రం.ఎస్పీ కంటిన్యూ చేస్తూ...

ఎస్పీ కంటిన్యూ చేస్తూ...

కమల్‌ డేట్ల కోసం నిర్మాతలంతా ఎదురు చూస్తున్నప్పుడు నన్ను పిలిచి నాతో సినిమా చేసుకో అన్నాడు. అలా 'శుభసంకల్పం' వచ్చింది. కమల్‌ మృదంగం బాగా వాయిస్తాడు. ఈ సినిమా నేను చూడలేదు. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం నాకుంది''అన్నారు.కె.విశ్వనాథ్‌ మాట్లాడుతూ...

కె.విశ్వనాథ్‌ మాట్లాడుతూ...

''కమల్‌తో కలసి నటించడం కష్టమైన పని. బాలచందర్‌ గారి దగ్గర శిష్యరికం చేయాలని చాలాసార్లు అనుకొన్నా. ఒక వారం పాటు మీ సినిమాకు సహాయకుడిగా పనిచేస్తానని చాలాసార్లు అడిగాను. ఆయన నన్ను తిట్టేవారు. నా మీద సరదాగా కోప్పడేవారు.విశ్వనాథ్ గారు కంటిన్యూ చేస్తూ...

విశ్వనాథ్ గారు కంటిన్యూ చేస్తూ...

కమల్‌హాసన్‌ పుణ్యమా అని ఈ చిత్రంలో నటించడం ద్వారా బాలచందర్‌ సహచర్యం పొందే గొప్ప అవకాశం దక్కింది. అది ఎప్పటికీ మరిచిపోలేను. వాళ్లిద్దరినీ చూసి నేను చాలా నేర్చుకొన్నాను'' అన్నారు.కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ....

కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ....

''సాగరసంగమం, స్వాతిముత్యం సినిమాలు చూస్తే దర్శకుడిగా కె.విశ్వనాథ్‌కీ, నటుడిగా కమల్‌ హాసన్‌కీ మధ్య ఉన్న అనుబంధం ఏంటో తెలుస్తుంది. ఆయనలాంటి మంచి దర్శకుడు దొరికితే ఏ నటుడైనా నాలాగే అవుతాడు.కమల్ కంటిన్యూ చేస్తూ...

కమల్ కంటిన్యూ చేస్తూ...

నా గురువుగారు కె.బాలచందర్‌ మీద రాసిన కవితను'ఉత్తమ విలన్‌' తమిళ ఆడియో వేడుకలో వినిపించా. అంతటి పాండిత్యం నాకు తెలుగులో లేదు. ఆ కవితని రామజోగయ్యశాస్త్రి అర్థం చేసుకొని తెలుగులో అనువదించారు. ఆయనకి నా కృతజ్ఞతలు.కమల్ మాట్లాడుతూ...

కమల్ మాట్లాడుతూ...

చాలా ఏళ్ల క్రితం అన్నయ్య ఎస్పీ బాలసుబ్రమణ్యం 30 వేల పాటల్ని పూర్తి చేసుకొన్నారన్న విషయం తెలిసింది. అప్పటికి అదో రికార్డు. ఈ విషయాన్ని సభాముఖంగా చెబుదామనుకొన్నా అప్పట్లో. అన్నయ్య నన్ను వారించాడు. రికార్డులు సృష్టించడం తప్ప బ్రేక్‌ చేయడం మన పని కాదు అన్న విషయం నా బుర్రకు అప్పుడు అర్థమైంది''అన్నారు.నటి గౌతమి మాట్లాడుతూ....

నటి గౌతమి మాట్లాడుతూ....

''నేనెంత పెద్ద హీరోయిన్‌ అయినా జీవితాన్ని ఎన్ని రకాలుగా దాటుకొచ్చినా నా అభిమాన నటుడు ఎప్పటికీ కమల్‌ హాసనే. 'సాగరసంగమం', 'స్వాతిముత్యం'లాంటి చిత్రాలు కమల్‌ తెలుగులో చేయడం లేదేంటి? అనుకొనే ప్రతి అభిమానికీ 'ఉత్తమ విలన్‌' ఓ సమాధానం'' అన్నారు.రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ...

రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ...

''తమిళంలో ఒక పాట మినహా మిగతావన్నీ కమల్‌ హాసనే రాశారు. ఆ భావాల్ని తెలుగులోకి అనువదించానంతే. ఇందులో విల్లు పాట పాడే అవకాశం నాకు కలిగింది''అన్నారు.జిబ్రాన్‌ మాట్లాడుతూ...

జిబ్రాన్‌ మాట్లాడుతూ...

''వూహలకు అతీతంగా ఆలోచించడం కమల్‌హాసన్‌గారి శైలి. ఈ సినిమాకి పని చేయడం మరిచిపోలేని అనుభూతి'' అన్నారు.దర్శకుడు మాట్లాడుతూ...

దర్శకుడు మాట్లాడుతూ...

''కమల్‌హాసన్‌ సినిమా నుంచి మీరేం కోరుకొంటారో అవన్నీ ఇందులో ఉంటాయి. ఈ సినిమాని ఎందుకు చూడాలని అడిగితే... ఇది కమల్‌ సినిమా, రెండో కారణం.. బాలచందర్‌గారి చివరి చిత్రం. ప్రపంచం వ్యాప్త నిపుణుల ప్రతిభ ఈ సినిమాలో ఉంది''అన్నారు.శృతిహాసన్‌ మాట్లాడుతూ..

శృతిహాసన్‌ మాట్లాడుతూ..

‘‘ నాన్నగారు చేసిన సినిమా ఆడియో ఫంక్షన్‌కి రావడం చాలా సంతోషంగా వుంది. ఈ సినిమా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వుంటుంది. జిబ్రాన్‌ మ్యూజిక్‌ అమేజింగ్‌. ఈ సినిమా ఘనవిజయం సాధించి అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటూ యూనిట్‌లోని అందరికీ ఆల్‌ ది బెస్ట్'' అన్నారు.కల్యాణ్‌

కల్యాణ్‌

నాకు దొరికిన అక్షయపాత్ర ఈ సినిమా అన్నారు సి.కల్యాణ్‌.


ఈ చిత్ర తమిళ నిర్మాతల్లో ఒకరైన లింగుస్వామి మాట్లాడుతూ ...

ఈ చిత్ర తమిళ నిర్మాతల్లో ఒకరైన లింగుస్వామి మాట్లాడుతూ ...

''ఈ సినిమాకు నిర్మాతనన్న విషయం మరిచిపోయాను. అందరి అభిమానుల్లాగే నేనూ ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా'' అన్నారు.


కుర్రాళ్లోయ్‌ కుర్రాళ్లు

కుర్రాళ్లోయ్‌ కుర్రాళ్లు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కమల్‌హాసన్‌ కలిసి పాటలు పాడిన విధానం వేడుకకి హాజరైనవారిని ఆకట్టుకొంది. కుర్రాళ్లోయ్‌ కుర్రాళ్లు.., ఏ తీగ పూవునో.., తేరే మేరే బీచ్‌మే... గీతాల్ని కమల్‌, బాలు కలసి ఆలపించారు. కార్యక్రమంలో...

కార్యక్రమంలో...

టి.సుబ్బరామిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి, పూజా కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.English summary
The Telugu audio launch of Kamal Haasan's most-awaited Tamil film 'Uttama Villain' was launched. Shruti, Kamal Haasan's daughter, took time off from her choc-o-block schedule to be a part of the grand affair.
Please Wait while comments are loading...