»   » సైబర్ క్రైమ్ కు బలైన శ్రుతి, ప్యాన్స్ ఎలర్ట్

సైబర్ క్రైమ్ కు బలైన శ్రుతి, ప్యాన్స్ ఎలర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సెలబ్రెటీల ఫేస్ బుక్, ట్విట్టర్ ఎక్కౌంట్ లు హ్యాక్ చేసి, ఇష్టమొచ్చిన పోస్ట్ లు పెట్టి పరువులు తీసే ప్రయత్నాలు కొందరు చేస్తూంటారు. వాటిని పట్టుకోవాలని సైబర్ క్రైమ్ పోలీస్ లు ప్రయత్నిస్తూంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రతీసారి ఎవరో ఒక సెలబ్రెటీ ఈ సైబర్ క్రైమ్ కు బలి అవుతున్నారు. ఈ సారి శ్రుతి హాసన్ ఫేస్ బుక్ ఎక్కౌంట్ ని హ్యాక్ చేసారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.

శ్రుతి హాసన్ కెరీర్ విషయానికి వస్తే.. శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా మాత్రమే కాదు... తన తండ్రి కమల్ లాగే మల్టీ టాలెంటెడ్‌గా మారబోతుంది. దక్షిణా దిలో ప్రముఖ తారల జాబితాలో చేరిపో యిన శ్రుతి ఇప్పుడు గీత రచయితగా, గాయకురాలుగా మారబోతుంది. అదీ మహిళా లోకంపై తన మొదట గీతం రాస్తుంది.

మహిళ శక్తి ఎలా ఉంటుంది. ప్రస్తుతం ఎలా ఉంది. ఎలా ఉండాలి అనే అంశాలన్నీ ఆమె పాట రూపంలో రాస్తోందట. తన పాట ద్వారా మహిళా గొంతును విన్పించబోతుందన్నట మాట. ఈ పాటకు బాలీవుడ్‌ ఇషాన్‌ అండ్‌ లోరు స్వరాలు సమకూర్చనున్నాడు.

ఒక పాటగానే కాకుండా వీడియో కూడా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటను మహిళా దినోత్సవం నాడు అంటే ఈనెల 8న విడు దల చేయనున్నారు. వీడియో తర్వాత విడుదల చేస్తామని శ్రుతి హాసన్‌ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈమె ప్రేమమ్‌' సినిమాలో నటిస్తోంది. నాగచైతన్య హీరోగా చేస్తోన్న ఈ చిత్రంలో శ్రుతి లెక్చరర్‌గా కన్పించబోతుంది.

English summary
Shruti Hassan fell prey to Cyber Crime after her official Facebook page has been compromised by online hackers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu