»   » సమంత సమస్య:రామ్ చరణ్ 'ఎవడు'సీన్స్ రీషూట్

సమంత సమస్య:రామ్ చరణ్ 'ఎవడు'సీన్స్ రీషూట్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : రామ్ చరణ్ తేజ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఎవడు'. ఈ చిత్రంలో మొదట ఎంపిక చేసిన సమంతతో క్రియేటివ్ డిఫెరెన్సిస్ రావటంతో ఆమెను తీసేసి శృతిని తీసుకున్నారు దర్సకుడు వంశీ పైడిపల్లి. దాంతో సమంత తో ఇంతకుముందు షూట్ చేసిన వన్నీ శృతిపై రీ షూట్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో నువ్వు వస్తానంటే..నే వద్దంటానా చిత్రం హిందీ రీమేక్ రామయ్యా వస్తావయ్యా లో శృతిహాసన్ చేస్తోంది. ఆమె జనవరి 4 నుంచి రామ్ చరణ్ తాజా చిత్రం ఎవడు షూటింగ్ లో పాల్గొననుంది.

  ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఐటం సాంగ్ ల స్పెషలిస్ట్ అయిన దేవి ఈ చిత్రం కోసం కెవ్వు కేక పాటను మించేలా ఐటం సాంగ్ ని స్వరపరిచారని చెప్పుకుంటున్నారు. ఈ పాట ఇలా సాగుతుంది.... "గాజు వాక సెంటర్లో అయ్యో పాపం..." అయ్యో పాపం... అనేది కెవ్వు కేక లాగ ప్రతీ చరణంలోనూ వస్తుందని, అది ఆడియన్స్ నోళ్లలో నాని పాట మెగా హిట్ అవుతుందని భావిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్ లో మగధీరను దాటే చిత్రం అవుతుందని,అన్ని జాగ్రత్తలూ తీసుకుని చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చెప్తున్నారు.

  శృతిహాసన్ తో పాటు సెకండ్ హీరోయిన్‌గా బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్‌ను కూడా ఎంపిక చేశారు. అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్జున్ సరసన కాజల్ గెస్ట్ గా ఎంపిక చేసారు. ఈ విషయమై దిల్ రాజు మాట్లాడుతూ.. అవును.. కాజల్ మా ఎవడు చిత్రంలో గెస్ట్ పాత్ర చేస్తోంది. ఆమె అల్లు అర్జున్ పాత్రకు పెయిర్ గా కనిపించనుంది అన్నారు. రామ్ చరణ్ తేజ్ వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న నాయిక్ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. కంటిన్యూగా'ఎవడు' , బాలీవుడ్ మూవీ జంజీర్ రీమేక్, వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగుల్లో పాల్గొంటూ వస్తున్నాడు. అల్లు అర్జున్,రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. పూర్తి స్ధాయి ఏక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుంది.

  English summary
  
 Yevadu's new schedule will commence from January 4 and director Vamsi Paidipally will film scenes on Ram Charan and Shruti Haasan in this schedule. Shruti has been a replacement after Samantha was ousted from the project due to creative differences. Apparently, the scenes which were earlier shot on Samantha, have to be reshoot again. Amy Jackson is playing the second lead while Allu Arjun and Kajal Aggarwal will be seen in important roles. Devi Sri Prasad is scoring the music for the film produced by Dil Raju.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more