»   » శృతి హాసన్ ‘గబ్బర్’ గేమ్.... (ఫోటోస్)

శృతి హాసన్ ‘గబ్బర్’ గేమ్.... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఠాగూర్' చిత్రానికి రీమేక్ గా హిందీలో ‘గబ్బర్' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్, శృతిహాసన్ జంటగా తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ, వయాకామ్ 18మోషన్ పిక్చర్స్, సబీనా ఖాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తూ విజయవంతంగా ముందుకు దూసుకెళుతోంది. ఈ చిత్రం ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి 'గబ్బర్ 3డి' గేమ్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం రామోజీ ఫిలిం సిటీలో జరిగింది.

ఈ సందర్భంగా శృతి హాసన్ మాట్లాడుతూ...ఈ సినిమాలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమా మంచి విజయం సాధించింది. అక్షయ్ కుమార్ చక్కటి కో-స్టార్. ఆయన దగ్గర్నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అన్నారు.

స్లైడ్ షోలో ఫోటోస్..

గేమ్

గేమ్


‘గబ్బర్' గేమ్ ఆసక్తికరంగా ఉంటుంది. బెస్ట్ 3డి గేమ్. నాకు వీడియో గేమ్స్ అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయం దొరికితే ఆడుతుంటాను అని శృతి హాసన్ తెలిపారు.

గేమ్ విజయం

గేమ్ విజయం


సినిమాలానే గేమ్ కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అన్నారు శృతి హాసన్

స్కై టాయ్ ఫౌండర్ శివ మాట్లాడుతూ

స్కై టాయ్ ఫౌండర్ శివ మాట్లాడుతూ


''2015లో పెద్ద హిట్ చిత్రంగా 'గబ్బర్ ఈజ్ బ్యాక్' నిలుస్తుంది. అలాంటి సినిమా గేమ్ ని లాంఛ్ చేయడం ఆనందంగా ఉంది. వయాకామ్ తో వర్క్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.

గబ్బర్

గబ్బర్


తెలుగు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఠాగూర్' చిత్రానికి రీమేక్ గా హిందీలో ‘గబ్బర్' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్, శృతిహాసన్ జంటగా తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ, వయాకామ్ 18మోషన్ పిక్చర్స్, సబీనా ఖాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

English summary
Photos of Actress Shruthi Hassan launch Gabbar Game at hyderabad on May 6, 2015.
Please Wait while comments are loading...