»   » రియాక్షన్: గౌతమి బ్రేకప్‌పై శ్రుతి హాసన్ ఇలా, కమల్ హాసన్ అలా....

రియాక్షన్: గౌతమి బ్రేకప్‌పై శ్రుతి హాసన్ ఇలా, కమల్ హాసన్ అలా....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గౌతమి, కమల్ హాసన్ విడిపోవడం వెనక తన పాత్ర ఉందనే ఊహాగానాలపై ప్రముఖ సినీ నటి శ్రుతి హాసన్ స్పందించింది. శ్రుతి హాసన్‌ వల్లనే గౌతమి కమల్ హాసన్‌తో తెగదెంపులు చేసుకుందని మీడియాలో ప్రచారం సాగిన విషయం తెలిసిందే.

కమల్ హాసన్, గౌతమి దాదాపు 13 ఏళ్ల సహజీవనం తర్వాత విడిపోయారు. తామిద్దరం విడిపోతున్నట్టు ట్విట్టర్‌ సాక్షిగా గౌతమి వెల్లడించడం హాట్‌ టాపిక్‌గా మారింది. వీరి బ్రేకప్‌ వెనుక కమల్‌ కూతురు, హీరోయిన్‌ శృతిహాసన్‌ హస్తం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా ఈ బ్రేకప్‌పై శృతిహాసన్‌ స్పందించింది.

'విడిపోవడం అనేది కమల్‌, గౌతమి వ్యక్తిగత నిర్ణయం. దానితో నాకు సంబంధం లేదు. వారి వ్యక్తిగత జీవితం, నిర్ణయాలపై నేనెప్పుడూ మాట్లాడను. నాకు నా తల్లిదండ్రులు, చెల్లెలే ముఖ్యం. వివాదాలను నేనెప్పుడూ పట్టించుకోను' అని స్పష్టం చేసింది.

Shruti haasan on Gautami and kamal hassan breakup

గౌతమి తనతో విడిపోవడంపై కమల్ హాసన్ కూడా స్పందించాడు. గౌతమికి ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండాలని, తన ఆనందమే కోరుకుంటున్నట్లు ప్రకటించారు. గౌతమి తీసుకున్న నిర్ణయానికి, తన మనోభావాలను ముడిపెట్టడం సరికాదన్నారు. గౌతమి, సుబ్బు సంతోషంగా ఉంటే చాలన్నారు.

తను ఎక్కడున్నా ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. దేవుడు తనకు శ్రుతి, అక్షర, సుబ్బులక్ష్మి‌లను కూతుళ్లుగా ఇవ్వడం అదృష్టమని ఆయన అన్నారు. ప్రపంచంలో అదృష్టవంతుడైన తండ్రిని కావడం సంతోషంగా ఉందన్నారు.

English summary
Kamal Hassan and his daughter Shruti Haasan responded on Guatami's breakup
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu