»   » నా కెరీర్ అడ్డం పడటం వల్లే బాయ్ ఫ్రెండ్స్ ని వదిలేసా... శృతీహసన్

నా కెరీర్ అడ్డం పడటం వల్లే బాయ్ ఫ్రెండ్స్ ని వదిలేసా... శృతీహసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టార్ కిడ్ అయినంత మాత్రాన శృతీ హసన్ కెరీర్ ఏం సాఫీగా సాగిపోలేదు. కట్తగట్టుకొచ్చి ఆఫర్లు పడిపోలేదు. మొదట్లోనే దారుణమైన ఫెయిల్యూర్స్ ని చూసింది తాను. ఇక టాలీవుడ్ లో అయితే ఏకంగా "ఐరన్ లెగ్" అనిపించుకుంది. తర్వాత నెమ్మదిగా పరిస్థితి మారింది శృతి తానేమిటో నిరూపించుకుంది.

పాత రిలేషన్‌షిప్స్ గురించి

పాత రిలేషన్‌షిప్స్ గురించి

ఇంతకుముందెన్నడూ తన ఎఫైర్ల గురించి వచ్చిన వార్తలపై స్పందించని శ్రుతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పాత రిలేషన్‌షిప్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన జీవితంలో ఫెయిల్యూర్ రిలేషన్ షిప్స్ ఉన్నాయని ఆమె అంగీకరించింది. తన పనికి అడ్డం పడటం వల్లే ఆ వ్యక్తులకు తాను దూరమైనట్లు ఆమె తెలిపింది.

పాత బాయ్ ఫ్రెండ్స్

పాత బాయ్ ఫ్రెండ్స్

చాలామంది హీరోయిన్ల లాగే శ్రుతి ఎఫైర్లతోనూ వార్తల్లో నిలిచింది. సిద్దార్థ్ అని.. ధనుష్ అని.. రైనా అని రకరకాల పేర్లతో ఆమెకు ముడిపెట్టారు. ఈ మధ్య కొత్తగా ఒక ఫారినర్‌తో ఎఫైర్ అంటూ రూమర్లు నడుస్తున్నాయి. పాత బాయ్ ఫ్రెండ్స్ తో తానెందుకు బ్రేకప్ కావాల్సి వచ్చిందో నిర్మొహమటంగా చెప్పేసింది శృతి హసన్.

సిద్ధార్థ్‌తో ప్రేమ‌

సిద్ధార్థ్‌తో ప్రేమ‌

తొలి సినిమా `అన‌గ‌న‌గా ఓ ధీరుడు` స‌మ‌యంలోనే శృతిహాస‌న్ ప్రేమ‌లో ప‌డిపోయింద‌ని వార్త‌లొచ్చాయి. అందులో క‌థానాయ‌కుడిగా న‌టించిన సిద్ధార్థ్‌తోనే ప్రేమ‌లో ప‌డింద‌ని, `ఓ మై ఫ్రెండ్` సినిమా స‌మ‌యానికి అది మ‌రింత డీప్‌గా మారింద‌ని చెప్పుకొన్నారు. ఏమైందో తెలియ‌దు కానీ.. ఆ త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెరిగింది.

దృష్టినంతా కెరీర్‌పైనే

దృష్టినంతా కెరీర్‌పైనే

ఆ త‌ర్వాత శృతి త‌న దృష్టినంతా కెరీర్‌పైనే ప‌ట్టింది. బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్... ఇలా ఎక్క‌డ నుంచి అవ‌కాశ‌మొస్తే అక్క‌డ న‌టించింది. ఈ జ‌ర్నీలో శృతిహాస‌న్ వైపు నుంచి మ‌ళ్లీ ప్రేమ‌క‌బురు మాత్రం వినిపించ‌లేదు. మ‌ధ్య‌లో `త్రీ` స‌మ‌యంలో త‌మిళ క‌థానాయ‌కుడు ధ‌నుష్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతోంద‌ని మాత్ర‌మే చెప్పుకొన్నారు.

మైఖేల్ అనే ఒక ఫారినర్ తో

మైఖేల్ అనే ఒక ఫారినర్ తో

కానీ ఆ ప్ర‌చారం కూడా ఎంతోకాలం సాగ‌లేదు. వెంట‌నే చల్లారిపోయింది.ఇప్పటికైతే మైఖేల్ అనే ఒక ఫారినర్ తో వార్తల్లో ఉంది శృతి. వాళ్లిద్ద‌రూ ఇప్పుడు డేటింగ్‌లో ఉన్నార‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చెవులు కొరుక్కొంటున్నాయి. మ‌రి అందులో ఎంత నిజ‌ముందన్న‌ది తెలియాల్సి వుంది.

మనతో పాటు మన పనిని కూడా

మనతో పాటు మన పనిని కూడా

తాను ఎప్పుడూ పని మీదే దృష్టిపెడుతుంటానని.. అది అవతలి వాళ్లకు నచ్చేది కాదని.. ఈ విషయంలో అభ్యంతరపెట్టగానే తన నుంచి దూరంగా వెళ్లిపోమని అవతలి వ్యక్తులకు చెప్పేశానని శ్రుతి తెలిపింది. మనతో పాటు మన పనిని కూడా ఇష్టపడేవారిని భాగస్వామిగా ఎంచుకోవడమే జీవితంలో అత్యంత కీలకమని ఆమె వ్యాఖ్యానించింది. ఐతే ఇప్పుడు తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నది లేనిది మాత్రం శ్రుతి చెప్పలేదు.

English summary
Actres, legend Actor Kamal Hasan's Daughter Sruthi Hasan Has Openup "Why Her old affairs broken up...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X