»   » శృతిహాసన్‌కు సర్జరీ.. సోషల్ మీడియాలో రచ్చరచ్చ.. ఆమెకు ఏమైందంటే..

శృతిహాసన్‌కు సర్జరీ.. సోషల్ మీడియాలో రచ్చరచ్చ.. ఆమెకు ఏమైందంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చిత్ర పరిశ్రమలో అందంతోపాటు టాలెంట్ ఉన్న తారల్లో శృతిహాసన్ ఒకరు. వెండితెర మీద అందంతోనే కాకుండా గాయనిగా కూడా హల్‌చల్ చేస్తుంటుంది. అలాంటి అందాల తార శృతిహాసన్ తాజాగా సర్జరీ చేసుకొన్నదనే విషయంపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయింది. పెదవులకు సర్జరీ చేపించుకొన్నట్టు తెలిపే ఫొటోలను కొందరు పోస్ట్ చేసి హంగామా చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై శృతిహాసన్ గట్టిగా సమాధానం చెప్పింది.

  నా దేహం.. నా ఇష్టం..

  నా దేహం.. నా ఇష్టం..

  ప్రస్తుతం శృతిహాసన్ హిందీలో బహెన్ హోగీ తేరి అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. నా ముఖం, నా దేహం. నా శరీరానికి గురించిన వ్యవహారాలు ఇతరులకు ఏం పని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సర్జరీ చేసుకొన్నారా లేదా అనే విషయంపై ఆమె సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు.

  అనవసరమైన కామెంట్లపై స్పందించను

  అనవసరమైన కామెంట్లపై స్పందించను

  నా గురించి సోషల్ మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేసిన పట్టించుకోను. ఏదో ప్రచారం చేస్తుంటారు. వారు చేసే కామెంట్లపై దృష్టిపెట్టను. వారందరికి సమాధానం చెప్పనవసరం లేదు అని ఘాటుగా సమాధానం ఇచ్చారు. మీడియాలో తనపై వచ్చే వార్తలపై ఇలా సూటిగా మాట్లాడటం శృతిహాసన్‌కు తొలిసారి కాదు. గతంలో కూడా శృతిహాసన్ ఇలానే ధీటుగా సమాధానం చెప్పారు.

  బరువు పెరుగడంపై కూడా రచ్చ..

  బరువు పెరుగడంపై కూడా రచ్చ..

  బహెన్ హోగీ తెరీ చిత్రంలోని పాత్ర కోసం శృతిహాసన్ ఇటీవల బరువు పెరిగింది. శృతిహాసన్ బరువు పెరుగడానికి కారణాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో కొందరు అతిగా స్పందించారు. అలాంటి వార్తలపై కూడా శృతిహాసన్ స్పందించింది. పాత్ర కోసం అందంగా, బొద్దుగా కనిపించడం నా బాధ్యత అని అన్నారు.

  నా వ్యక్తిగత విషయాలపై వారికెందుకు..

  నా వ్యక్తిగత విషయాలపై వారికెందుకు..

  బరువు పెరుగడం అనే విషయం నా వ్యక్తిగత, వృత్తి జీవితానికి సంబంధించిన అంశం. దానిపై పనిలేని వాళ్లు కామెంట్లు చేస్తే నేను పట్టించుకోను. ఒకరికి నచ్చే విధంగా నా దేహాన్ని ఉంచుకోవాలనుకోవడం నా ఉద్దేశం కాదు. నేను మనిషినే. సాధారణంగా ఒక్కోసారి మన ప్రమేయం లేకుండా బరువు పెరుగుతాం, తగ్గుతాం. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరొకరికి సమాధానం చెప్పాల్సిన పనిలేదు అని ఆమె అన్నారు.

  సంఘమిత్రపై అనేక ఊహాగానాలు

  సంఘమిత్రపై అనేక ఊహాగానాలు

  ప్రతిష్ఠాత్మకంగా రూపొందనున్న సంఘమిత్ర చిత్రం నుంచి శృతిహాసన్ అనూహ్యంగా తప్పుకోవడం కూడా మీడియాలో చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో కూడా అనేక ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. స్క్రిప్టు, షెడ్యూల్‌పై స్పష్టమైన సమాచారం లేకపోవడం వల్ల శృతిహాసన్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నారు అని ఆమె మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

  English summary
  Shruti Haasan is one of the most beautiful actresses that we have in the industry! Her good looks and charm has the men swooning over her. However a couple of days back, the actress has heavily slammed on the social media for allegedly getting a lip job done. There were people putting up recent pictures of the actress and pointing out how she has undergone a surgery.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more