»   » యాక్సిడెంట్ కు గురైన శృతి హాసన్ తల్లి

యాక్సిడెంట్ కు గురైన శృతి హాసన్ తల్లి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : శృతి హాసన్ తల్లి సారిక...యాక్సిడెంట్ కు గురి అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ న్యూస్ మీడియాలో ప్రముఖంగా రాలేదు కానీ బాలీవుడ్ సర్కిల్స్ లో మాత్రం వినపడుతోంది. అయితే కంగారుపడాల్సిందేమీ లేదని, ఆమె క్షేమంగానే ఉన్నట్లు సమాచారం. ఉదయం ఆమె జాగింగ్ చేస్తున్నప్పుడు వెనక నుంచి వచ్చిన ఆటో రిక్షా గుద్దిందని అంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సారిక ..సీరయస్ గా గాయాలు ఏమీ తగలలేదు కానీ...ఓ నెల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శృతి హాసన్ తన తాజా చిత్రం గబ్బర్ ఈజ్ బ్యాక్ ప్రమోషన్ లో బిజీగా ఉంది. అయినా తన తల్లి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంది. అక్షర హాసన్ తన తల్లి దగ్గర ఉండి కేర్ తీసుకుంటోందని చెప్తున్నారు. ఈ వారంలో కమల్ సైతం తన మాజీ భార్య సారికను కలిసే అవకాసం ఉందని, ఉత్తమ విలన్ ప్రమోషన్ తీరిక దొరకగానే ఈ పని చేస్తాడని చెప్పుకుంటున్నారు.

ఇక శృతి హాసన్ విషయానికి వస్తే..

Shruti Haasan's mother met with accident

ప్రస్తుతం తెలుగులో మహేష్‌బాబు సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. 'సైజ్‌ జీరో'లో ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. 'జీవితాన్ని ఎలా గడపాలో నేనేం ప్లాన్‌ చేసుకోలేదు. ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కొనేలా నన్ను నేను సిద్ధం చేసుకొన్నా. అందుకే నాకు భవిష్యత్తుపై బెంగ లేదు'' అంటోంది శ్రుతిహాసన్‌.

శ్రుతి మాట్లాడుతూ ''డబ్బు, దర్పం, హోదా.. ఇవేమీ నన్ను, నా జీవిత గమనాన్ని మార్చలేవు. అన్నీ ఉండి కూడా ఏమీ లేనట్టు ఎలా బతకాలో చిన్నప్పుడే నేర్చుకొన్నా. సాదాసీదా జీవితంలో ఎంత మాధుర్యం ఉందో నా బాల్యమే నాకు చెప్పింది.

జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో బాల్యమే నేర్పింది. అందుకే నాకిప్పుడు ఎలాంటి భయాలూ లేవు. జీవితంలో ఏం ఉన్నా, లేకున్నా మనల్ని ప్రేమించేవాళ్లు ఒకరుంటే చాలు. నాకు మాత్రం అమ్మ, నాన్న, చెల్లి.. ఇలా చాలామంది ఉన్నారు'' అని గర్వంగా చెబుతోంది శ్రుతి.

English summary
Sarika, mother of Shruti Haasan and Akshara, has met with an accident. There is nothing to worry as the accident is by an auto-rickshaw which hit her when she is jogging in the morning.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu