»   » కేన్స్‌లో దెబ్బ: శృతిహాసన్ సంఘమిత్ర కథ లీక్.. సోషల్ మీడియాలో వైరల్..

కేన్స్‌లో దెబ్బ: శృతిహాసన్ సంఘమిత్ర కథ లీక్.. సోషల్ మీడియాలో వైరల్..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాహుబలి2 తర్వాత దక్షిణాదిలో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రం సంఘమిత్ర. అందాల తార శృతిహాసన్ టైటిల్ పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి పీసీ సుందర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్‌ను తాజా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చేస్తున్నారు. అందుకోసం శృతిహాసన్‌తోపాటు చిత్ర యూనిట్ కేన్స్ సినిమా పండుగకు హాజరైంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కథ మీడియాకు బహిర్గతమైంది. కథకు సంబంధించిన రైటప్‌ను ప్రముఖ ట్రేడ్ అనలిస్టు రమేశ్ బాలా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ట్విట్టర్‌లో పేర్కొన్న ప్రకారం కథ ఏమిటంటే..

  అప్పటి కథను అందంగా..

  అప్పటి కథను అందంగా..

  సంఘమిత్ర 8వ శతాబ్దం కాలం నాటి కథ. రాణి సంఘమిత్ర జీవితంలో ఒడిదుకుడుకులు ప్రధాన కథ. శత్రువుల దాడికి గురైన సామ్రాజ్యాన్ని రక్షించుకోవడానికి అందాల యువరాణి చేసిన పోరాటమే ఈ కథా నేపథ్యం. ఈ కథలో ఎందరో రాజులు, ఎన్నో సామ్రాజ్యాలు, దేశాలు, వారి ఎత్తులు పైఎత్తులు, ఆయా దేశాల మధ్య మైత్రి, శృత్వత్వంలో కథల భాగమైన కోణాలు. ఇలాంటి అంశాలను వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతున్నది.

  ఇది కల్పిత కథే..

  సంఘమిత్ర కేవలం కల్పిత కథ. చరిత్రలోని కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని అల్లుకొన్న కథ. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని శృతిహాసన్ పాత్రకు సంబంధించిన ఫొటోలు విడుదలయ్యాయి. వాటికి ఇంటర్నెట్‌లో విపరీతమైన స్పందన వస్తున్నది.

  ఛాన్స్ కొట్టేసిన శృతి..

  ఛాన్స్ కొట్టేసిన శృతి..

  సంఘమిత్ర పాత్రను పోషిస్తున్న శృతిహాసన్‌కు ఈ సినిమా విడుదలకు ముందే అరుదైన అవకాశాన్ని కల్పించింది. ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫెస్టివల్‌లో పాల్గొనే ఛాన్స్‌ను శృతి కొట్టేసింది. కేన్స్‌ ఉత్సవాల మొదటి రోజున ఈ ప్రాజెక్ట్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జయం రవి, ఆర్య, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను కేన్స్ నిర్వాహకులు విడుదల చేశారు.

  నా అదృష్టం..

  నా అదృష్టం..

  కేన్స్ సంబురాలలో దర్శకుడు పీసీ సుందర్ మాట్లాడుతూ.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సంఘమిత్రను ఆవిష్కరించడం గర్వంగా ఉంది. ఇది దర్శకుడిగా నాకు దక్కిన అపురూపమైన గౌరవం. ఈ కార్యక్రమంలో నా నిర్మాతలు, నటీనటులు నా వెంట ఉండటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావడం అదృష్టం. ఈ చిత్రం నా సినీ జీవితానికి సవాల్ లాంటింది. ఇది నాకు ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని అన్నారు.

  కత్తి సాములపై దృష్టి..

  కత్తి సాములపై దృష్టి..

  సంఘమిత్ర చిత్రం కోసం ఇప్పటికే శృతిహాసన్ కసరత్తు ప్రారంభించింది. యుద్ధ పోరాటాలకు సంబంధించిన శిక్షణ, కత్తిసాము లాంటి విద్యలో మెలకువలపై ఆమె దృష్టిపెట్టింది. అలాగే జయం రవి, ఆర్య, ఇతర పాత్రధారులు తమ రోల్స్‌కు అనుగుణంగా ఎక్సర్‌సైజ్ ప్రారంభించారు.

  English summary
  This Cannes 2017, Shruti Haasan will make her grand debut thanks to her next project Sanghamitra. This mega budget will be helmed by PC Sundar. The film will be bank rolled by Sri Thenandal Films. This highly ambitious project will be launch on the first night of Cannes. Shruti Haasan, Jayam Ravi, Arya, product designer Sabu Cyril who has joined this film post Baahubali will be present. While nothing about the plot had been revealed before, the synopsis of Sanghamitra as part of Cannes press release is now out!
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more