»   » భర్తతో సెల్ఫీ : పోస్ట్ చేసిన శృతీహసన్

భర్తతో సెల్ఫీ : పోస్ట్ చేసిన శృతీహసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

"నా భర్తతో కలిసి లంచ్‌ చేశాను" శృతీ హసన్ ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చూడగానే జనాలందరూ ఉలిక్కి పడ్డారు. ఆమె యువ అభిమానుల్లో కొందరికైతే హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైందట.. ఒక్కసారిగా అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టైంది. శృతి సీక్రెట్‌గా పెళ్లి చేసేసుకుందా? ఎప్పుడూ..? ఎక్కడా..? అంటూ తెగ ఆత్రంగా మెసేజ్‌లు పెట్టేశారు....

అసలు సంగతేంటంటే.... శ్రుతి తన స్నేహితుడు, ప్రముఖ బాలీవుడ్‌ స్క్రీన్‌ ప్లే రైటర్‌, పాటల రచయిత నిరంజన్‌ అయ్యంగార్‌తో కలిసి సరదాగా లంచ్‌కి వెళ్లింది. మెనూ లో ఫుడ్ ఐటంస్ అన్నీ హాలీవుడ్‌ అమెరికన్‌ డ్రామా సిరీస్‌ 'గేమ్‌ ఆఫ్‌ ట్రోన్స్‌'లోని క్యారెక్టర్ల పేర్లతో ఉన్నాయిట. అవి చూసి తానూ సరదాగా ఎవర్నైనా ఏడిపించాలనుకుందట.

అదే మాట నిరంజన్ తో అంటే నీకు పెళ్ళైందని చెప్పు చాలు అంతకంటే షాకింగ్ న్యూస్ ఉంటుందా, నేనుకూడా కలవర పడే న్యూస్ అది అన్నాడట. దాంతో ఏకంగా నిరంజన్ నే తన భర్త గా పేర్కొంటూ ఫేస్బుక్ లోనే వీళ్ళిద్దరూ దగ్గరగా ఉన్న ఒక సెల్ఫీ పెట్టి మరీ నా భర్తతో లంచ్ చేస్తున్నా అంటూ... జనం గుండెల్లో బాబు పేల్చింది ఈ భామ..

కానీ ఆ పోస్ట్ చూడగానే కింద వచ్చిన రెస్పాన్స్ చూసి మరీ ఎక్కువసేపు ఏడ్పించటం బాగోదని సీక్రేట్ రివీల్ చేసేసిందట. దీంతో తాను కూడా ఇలా ఏదో సరదాగా అన్నానంటూ ట్విట్టర్‌ లో పోస్ట్ చేసింది. ఈ మెసేజ్ చూడగా నే కాస్త ఊపిరి పీల్చుకున్నారట ఆమె అభిమానులు.

English summary
"Game of thrones lunch with my dearest husband" Shruti Haasan posted in her Twitter account.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu