»   » రెమ్యూనరేషన్లో చుక్కలు చూపిస్తున్న శృతి హాసన్

రెమ్యూనరేషన్లో చుక్కలు చూపిస్తున్న శృతి హాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ శృతి హాసన్ రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది. కెరీర్ మొదట్లో అసలు హిట్లే లేక ఇచ్చినంత పారితోషికం తీసుకుని సినిమాలు చేసిన శృతి హాసన్....కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వరుసగా విజయాలు తన ఖాతాలో వేసుకుంది.

టాలీవుడ్లో ఆమె నటించిన ‘శ్రీమంతుడు' బారీ విజయం సాధించడం, అటు తమిళంలో చేసిన ‘వేదాళం' కూడా సూపర్ హిట్ కావడంతో ఆమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఆమెకు తమిళంలో హిట్ల సంఖ్య తక్కువే. అయితే టాలీవుడ్లో మాత్రం ఆమె ఖాతాలో చాలా హిట్స్ ఉన్నాయి. దీంతో తమిళంలో తక్కువ రెమ్యూనరేషనే తీసుకుంటున్న ఈ బ్యూటీ తెలుగులో మాత్రం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. ఒక్కో సినిమాకు ఏకంగా రూ. కోటిన్నర డిమాండ్ చేస్తోంది.

ఫాంలో ఉన్న హీరోయిన్ కావడంతో నిర్మాతలు కూడా ఆమె డిమాండ్ కు తలొగ్గి అడిగినంత ముట్టజెబుతున్నారట. తాజాగా ఆమె నాగ చైతన్య హీరోగా తెరకెక్కబోతున్న ‘ప్రేమం' తెలుగు రీమేక్ లో సెలక్టయింది. దీంతో పాటు రామ్ చరణ్ చేయబోయే తమిళ రీమేక్ లోనూ ఆమెనే తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.

Shruti Haasan shocking remuneration

నాగ చైతన్య-శృతి హాసన్ మూవీ పూర్తి వివరాలు..
అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్ ల తొలి కాంబినేషన్ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. మళయాలంలో భారీ విజయం సాధించిన చిత్రం 'ప్రేమం' చిత్రానికి ఇది రీమేక్. సూర్యదేవర నాగ వంశీ నిర్మాత. అక్కినేని నాగచైతన్య సరసన శ్రుతిహాసన్ తో పాటు మరో ఇద్దరు కధానాయికలు కూడా నటిస్తున్నారు. వారిలో ఒకరు 'అనుపమ పరమేశ్వరన్' కాగా మరో కధానాయిక ఎంపిక కావలసి ఉంది.

ఈ చిత్రానికి సంగీతం; రాజేష్ మురుగేషన్, గోపిసుందర్; చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని: ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు; ఆర్ట్: సాహి సురేష్; ఒరిజినల్ స్టోరి: ఆల్ఫోన్సె పుధరిన్; సమర్పణ: పి.డి.వి. ప్రసాద్ నిర్మాత: సూర్యదేవర నాగవంశి స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: చందు మొండేటి.

English summary
Shruti Haasan was flooded with lot of offers after the stupendous success of Srimanthudu, but she turned down few of them saying that she is busy till early next year. That's how she signed Naga Chaitanya's Majnu for which she will be paid Rs 1.5 crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu