»   » మాస్ హీరోను పట్టేసిన శృతిహాసన్.. ఇకనైనా ఆయనకు సక్సెస్ దక్కేనా!

మాస్ హీరోను పట్టేసిన శృతిహాసన్.. ఇకనైనా ఆయనకు సక్సెస్ దక్కేనా!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  కాటమరాయుడు తర్వాత అటు తెలుగులో గానీ, తమిళంలో గానీ సినిమాలు అంగీకరించకపోవడంతో శృతిహాసన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. లండన్ ప్రియుడు కోర్సలేతో అతిసన్నిహితంగా ఉంటూ అతడితో అప్పట్లో చెన్నైలో ఓ పెళ్లికి హాజరవ్వడం చర్చనీయాంశమైంది. అయితే తాజాగా ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ తదుపరి చిత్రం అమర్ అక్బర్ ఆంథోని చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

  కాటమరాయుడు చిత్రంలో

  కాటమరాయుడు చిత్రంలో

  మార్చి 2017లో రిలీజైన కాటమరాయుడు చిత్రంలో చివరిసారిగా శృతిహాసన్‌ కనిపించింది. దర్శకుడు సుందర్ సీ ప్రతిష్టాత్మకంగా రూపొందించే సంఘమిత్రలో టైటిల్ రోల్ పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం నుంచి శృతి తప్పుకోవడం వివాదంగా మారింది.

   అమర్ అక్బర్ అంథోనిలో రవితేజతో

  అమర్ అక్బర్ అంథోనిలో రవితేజతో

  ఆ తర్వాత మైఖేల్ కోర్సలేతో అడపాదడపా కనిపిస్తూ వార్తల్లో నిలిచిన శృతిహాసన్‌ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారనే నేపథ్యంలో అమర్ అక్బర్ అంథోనిలో రవితేజ్‌తో కలిసి నటించేందుకు అంగీకరించారు. గతంలో వీరిద్దరూ నటించిన బలుపు చిత్రం మంచి విజయాన్ని చేజిక్కించుకొన్న సంగతి తెలిసిందే.

  దర్శకుడిగా శ్రీను వైట్ల

  దర్శకుడిగా శ్రీను వైట్ల

  వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంథోని రూపొందనున్నది. గతంలో శ్రీనువైట్ల రూపొందించిన ఆగడు చిత్రంలో ఓ స్పెషల్ పాత్రలో మెరిసింది. మరోసారి శ్రీనువైట్లతో జతకట్టడం ఆసక్తికరంగా మారింది.

  మహేష్ మంజేక్రర్

  మహేష్ మంజేక్రర్

  అంతేకాకుండా ఓ బాలీవుడ్ చిత్రంలో నటించేందుకు కూడా శృతిహాసన్ ఒప్పుకొన్నారు. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో యువ నటుడు విద్యుత్ జమ్వాల్ హీరోగా నటిస్తున్నారు.

  English summary
  Shruti has been roped in by director Srinu Vaitla for his next, titled Amar Akbar Anthony. Shruti was last seen opposite Pawan Kalyan in Katamarayadu, which released in March 2017. After that, she was roped in for Sundar C's period drama Sangamithra, but opted out of the project citing creative differences.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more