»   » బలుపు.... బ్రహ్మానందంపై శృతిహాసన్ కామెంట్

బలుపు.... బ్రహ్మానందంపై శృతిహాసన్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : రవితేజ, శృతి హాసన్, అంజలి హీరో హీరోయిన్లుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'బలుపు' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో హీరోయిన్ శృతి హాసన్ తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించడంతో పాటు నవ్వుల డాన్ బ్రహ్మానందంపై కామెంట్స్ చేసింది.

''బ్రహ్మానందం గారి నుంచి ఎంతో కామెడీ నేర్చుకున్నాను. ఆయన ఇంటి నుంచి ఎంతో రుచికరమైన ఆంధ్రా వంటకాలు తెప్పించారు. అందుకు కృతజ్ఞతలు. ప్రకాష్ రాజ్ లాంటి గొప్ప నటులతో పని చేయడం ఆనందంగా ఉంది. నా ఫేవరెట్ కెమెరామెన్ విన్సెంట్ ఈ చిత్రానికి పని చేసారు'' అంటూ ట్వీట్ చేసారు.

బలుపు చిత్రాన్ని పివిపి సినిమా బేనర్‌పై ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. మాస్ ఎంటర్టెనర్‌గా రూపొందిన ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మరో పది రోజుల్లో ఈచిత్రం సెన్సార్‌కు వెళ్లనుంది. జూన్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. త్వరలో విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.

ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రావు రమేష్, అలీ, అశుతోష్ రాణా, అడవి శేషు, సుప్రీత్, ఆదిత్య మీనన్, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, శేఖర్, అజయ్, షఫీ, శ్రీనివాస్ రెడ్డి, సన, రాజశ్రీ నాయర్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రానికి కథ, మాటలు: కోన వెంకట్, కె. ఎస్. రవీంద్ర, పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, భాస్కర భట్ల, ఫైట్స్: స్టన్ శివ, కొరియోగ్రఫీ: రాజు సుందరం, బృందం, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: గౌతం రాజు, సినిమాటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: థమన్, నిర్మాత: పరమ్ వి. పొట్లూరి.

English summary
"Wrap on balupu rushing to another shoot ! Zip zip zoom. Learned so much abt comedy from bramha gaaru !!!. And Thankyou so much to bramha gaaru for the most delicious andhra delicacies from his home so touched :)" Shruti Haasan tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu