»   » శృతి హాసన్ బాలీవుడ్ భవిష్యత్ తేలేది ఈ నెల్లోనే!

శృతి హాసన్ బాలీవుడ్ భవిష్యత్ తేలేది ఈ నెల్లోనే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రభుదేవా దర్శకత్వంలో సిద్ధార్థ్, త్రిష జంటగా నటించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రాన్ని హిందీలో 'రామయ్యా వస్తావయ్యా' పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈచిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

బాలీవుడ్‌లో నిర్మించిన ఈ చిత్రంలో గిరీష్‌కుమార్, శృతిహాసన్ జంటగా నటించారు. ఈ సినిమాపై శృతి హాసన్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్టయితే తన బాలీవుడ్ భవిష్యత్ బాగుంటుందనే నమ్మకంతో ఉంది. గతంలో 'లక్' అనే బాలీవుడ్ చిత్రంతో తెరంగ్రేటం చేసిన ఆమెకు ఆ సినిమా ప్లాపు కావడంతో బాలీవుడ్లో ఉండలేని పరిస్థితి ఏర్పడింది.

'లక్' సినిమాతో లక్ కలిసిరాని శృతి హాసన్ దక్షిణాది చిత్రాలపై దృష్టి కేంద్రీకరించినా ఫలితం లేక పోయింది. అయితే తెలుగులో వచ్చిన 'గబ్బర్ సింగ్' శృతి దశ మార్చింది. అప్పటి వరకు ఐరన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శృతి ఈ సినిమాతో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ఆమె కాలు పెట్టిన ప్రతి సినిమా హిట్టే. మరి ఈ హిట్ మ్యాజిక్ బాలీవుడ్లో వర్కౌట్ అవుతుందా?

కాగా...'రామయ్యా వస్తావయ్యా' చిత్రానికి సంబంధించిన పరిచయ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రభుదేవా మాట్లాడుతూ టిప్స్ సంస్థకు ఓ సినిమా చేయమని గిరీష్ తరౌని చెప్పారని, ఓ డివిడి ఇచ్చి ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని అనడంతో అది తాను నిర్మించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' అవడం యాదృచ్ఛికమని, ఆ చిత్రానికి తానే దర్శకుణ్ణన్న విషయం వారికి తెలియదని తెలిపారు.

అన్నాచెల్లెళ్ల అనుబంధం ఎక్కడైనా ఒకేలా ఉంటుందని, అందుకే ఎటువంటి మార్పులు లేకుండా ఈ చిత్రాన్ని రీమేక్ చేశామని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసిన ఈ హిందీ చిత్రం ఈనెల 19న విడుదలవుతోందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రభుదేవా, కథానాయకుడు గిరీష్‌కుమార్ నృత్యం చేసి ప్రేక్షకులను అలరించారు.

English summary
After a two-year gap, Shruti Haasan returns to Hindi movies with 'Ramaiya Vasta Vaiya' and clarifies that the Prabhudheva directorial venture can't be tagged as her comeback movie. "I enjoyed playing the character.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu