For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫోటోలు : శృతి హాసన్ హాట్ అండ్ సెక్సీ ‘బలుపు’

  By Bojja Kumar
  |

  హైదరాబాద్ : హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం రవితేజ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న 'బలుపు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శృతి హాట్ అండ్ సెక్సీగా అందాల విందు చేయబోతోంది. తాజాగా విడుదలైన 'బలుపు' ఫోటోలు చూస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. అందుకు సంబంధించిన ఫోటోలను స్లైడ్ షోలో వీక్షించవచ్చు.

  'గబ్బర్ సింగ్' చిత్రం వరకు అందాల ప్రదర్శన విషయంలో కాస్త పొదుపుగా వ్యవహరించిన శృతి హాసన్ ఆ చిత్ర విజయంతో వరుస అవకాశాలు దక్కించుకుంది. ఇదే అదునుగా యూత్‌లో ఫాలోయింగ్ పెంచుకునేందుకు గ్లామర్ ఘాటు కాస్త పెంచేసింది ఈ అమ్మడు. ఇక ఆమె నటిస్తున్న బాలీవుడ్ చిత్రాల విషయంలో అందాల జూలు విప్పిందిని చెప్పక తప్పదు.

  'బలుపు' చిత్రం ఆడియో లాంచ్ ని జూన్ 1 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ని HICC లో ఈ ఆడియో పంక్షన్ జరగనుంది. అలాగే జూన్ చివరి వారంలో చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. అంజలి మరో హీరోయిన్ గా నటిస్తుండగా, లక్ష్మి రాయ్ ప్రత్యేక గీతంలో కనిపించనుంది.

  ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రావు రమేష్, అలీ, అశుతోష్ రాణా, అడవి శేషు, సుప్రీత్, ఆదిత్య మీనన్, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, శేఖర్, అజయ్, షఫీ, శ్రీనివాస్ రెడ్డి, సన, రాజశ్రీ నాయర్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రానికి కథ, మాటలు: కోన వెంకట్, కె. ఎస్. రవీంద్ర, పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, భాస్కర భట్ల, ఫైట్స్: స్టన్ శివ, కొరియోగ్రఫీ: రాజు సుందరం, బృందం, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: గౌతం రాజు, సినిమాటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: థమన్, నిర్మాత: పరమ్ వి. పొట్లూరి.

  బలుపు చిత్రంలో హీరోయిన్ శృతి హీసన్ అందాల ప్రదర్శన ప్రేక్షకులకు మత్తెక్కించనుంది.

  ఏమిటి ఉన్నట్టుండి ఇలా రెచ్చిపోతున్నారని అంటే, తనదైన రీతిలో సమాధానం ఇస్తోంది శృతి.

  ‘నేను నటిని కావాలని చిన్నప్పటి నుంచి ఆశ పడుతున్నాను. కానీ నటిగా నేను అంత అందంగా ఉండనేమోనని భావిస్తాను. పాపులర్ అయిన హీరోయిన్లు అంతా ఎంతో అందంగా ఉంటారు. నేను వాళ్లలా ఎలా మారాలిన ఆలోచించేదాన్ని. నేను ఏ పని చేసినా సినిమా వ్యాపారంలో కలకాలం నిలదొక్కుకోవాలనే ఆశతోనే. నటిగా మారినా, పాటలు పాడినా అవి అందులో భాగమే' అంటూ చెప్పుకొచ్చింది.

  ఎన్నో ఓడుదుడుకులు ఉదుర్కొంటూ ఈ స్థాయికి ఎదిగాను, అందుకే సినిమా రంగంలో స్థానం సుస్థిరంగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అని...తన సెక్సీ చేష్టలను సమర్థించుకుంటోంది శృతి

  గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత ప్రస్తుతం శృతి రవితేజతో బలుపు, రామ్ చరణ్ ఎవడు చిత్రాల్లో నటిస్తోంది.

  ప్రస్తుత సినిమాల్లో హీరోయిన్ల గ్లామర్ ప్రదర్శనకే దర్శకులు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్న నేపథ్యంలో....వారికి ఆలోచనలకు తగిన విధంగా అందాల ప్రదర్శనకు సై అంటూ అవకాశాలు దక్కించుకుంటోంది.

  హిందీ మూవీ ‘లక్' సినిమాతో హీరోయిన్ పరిచయమైన శృతి ఆ సినిమా ప్లాపు కావడంతో ‘అనగనగా ఓ ధీరుడు' చిత్రంతో దక్షిణాది జర్నీ ప్రారంభించిన శృతి హాసన్‌కు ఆ సినిమా కూడా ప్లాపు కావడంతో ఇక్కడా చేదు అనుభవమే ఎదురైంది.

  పలు ప్లాపు చిత్రాల అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘గబ్బర్ సింగ్' చిత్రం శృతి కెరీర్‌ను మలుపు తిప్పింది.

  గబ్బర్ సింగ్ విజయంతో స్టార్ హీరోయిన్ గా మారిన శృతి హాసన్ ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంది.

  దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్ మూవీలు చేస్తూ బిజీ అయిపోయింది. బాలీవుడ్లో శృతి హాసన్ గ్లామర్ డోస్ ఓవర్‌గా ఉండటం విమర్శలకు దారి తీసినప్పటికీ....ఆ మాత్రం డోసు ఉంటేనే ఇక్కడ నిలదొక్కుకోగలం అనే భావనలో ఉంది శృతి

  English summary
  Shruti Hassan hot appearance in balupu. Balupu is an upcoming Telugu Movie. Directed by Gopichand Malineni and Produced by Prasad Vara Potluri under PVP Cinema. Music scored by S.Thaman. Ravi Teja, Shruti Hassan and Anjali are in the lead roles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X