»   » ఎవరికీ చెప్పాల్సిన అవసరంలేదు..శృతి హాసన్

ఎవరికీ చెప్పాల్సిన అవసరంలేదు..శృతి హాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఫిల్మ్ స్టార్స్ లైఫ్ ల గురించి అందరికీ ఇంట్రస్ట్ ఉంటుందని తెలుసు. అయితే నా పర్శనల్ లైఫ్ గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పక తప్పదు అనుకొంటే సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్లలో నా అభిప్రాయాలు పంచుకోవడానికి సిద్ధమే అంటోంది శృతిహాసన్. ఆమెకూ, సిద్దార్ధకూ ఎఫైర్ నడుస్తోందని, వారిద్దరూ ముంబైలో సహజీవనం చేస్తున్నారంటూ మీడియాలో వార్తలు కంటిన్యూగా వస్తున్న నేపధ్యంలో ఆమె ఇలా స్పందించింది. అలాగే ఎప్పుడూ పక్కవాళ్ల జీవితాల్లో ఏం జరుగుతోంది ఆలోచన మంచిది కాదు.. అయితే స్వతహాగా మనుషుల మసస్తత్వాలే అంత అంది.

అనగనగా ఒక ధీరుడు సమయం నుంచి సిద్దార్ధ,శృతిహాసన్ ల అనుభంధం పెరిగి అది సహజీవనం దాకా వెళ్ళింది.ఇప్పుడు వాళ్లిద్దరూ కలిసి ఓహ్.. మై ప్రెండ్ చిత్రంలో చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఆ చిత్రాన్ని వేణు శ్రీరామ్ అనే నూతన దర్శకుడు డైరక్ట్ చేస్తున్నాడు. అలాగే ఆ చిత్రంలో హన్సిక మరో హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంతో పాటు శృతి హాసన్... ఎన్టీఆర్‌, పవన్‌కల్యాణ్‌ చిత్రాలు చేస్తోంది వీటితో పాటు ఆమె సంగీతం, పాటలు పాడటం వంటివి కూడా చేస్తూ తనను తాను ఎప్పుడూ బిజీ చేసుకుంటోంది.

ఇక హైదరబాద్ గురించి చెబుతూ.. ''హైదరాబాద్‌ అంటే నాకు చాలా ఇష్టం. ముంబైతో పోలిస్తే ఈ నగరం చాలా శుభ్రంగా ఉంటుంది. వాతావరణం బాగుంటుంది. అయితే ఇప్పట్లో ఇక్కడ స్థిరపడే అవకాశాల్లేవు'' అని చెబుతోంది. అదీ సంగతి.

English summary
Shruti Hassan made debut in Telugu opposite Siddharth in Anaganaga O Dheerudu. Although the film didn't become a hit, their chemistry was appreciated. So they duo are back together for another film. Shruti Hassan now replaces Nithya Menon in producer Dil Raju's new film with Siddharth, which is tentatively titled O My Friend.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu